హైస్కూల్‌కు పూర్వవిద్యార్థుల ఉదారత
ABN , First Publish Date - 2023-06-26T23:52:09+05:30 IST
: తమకు విద్యా బుద్దులు నేర్పిన పాఠశాల రుణం తీర్చుకునేందుకు పి.గన్నవరం హైస్కూల్లో 1993-84 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు నడుంబిగించారు.
పి.గన్నవరం, జూన్ 26: తమకు విద్యా బుద్దులు నేర్పిన పాఠశాల రుణం తీర్చుకునేందుకు పి.గన్నవరం హైస్కూల్లో 1993-84 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు నడుంబిగించారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి ఏడాది మొదటి, ద్వితీయ, తృతీయ స్ధానాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.2.20 లక్షలు డిపాజిట్ చేశారు. సంబందిత పత్రాలను సోమవారం పూర్వ విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎం డీవీవీఎస్ ప్రసాద్‌కు అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులనుపలువురు అభినందించారు. కార్యక్రమంలో అబ్ధుల్‌కలామ్ చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ భీమాల వెంకటేశ్వరరావు, పాఠశాల చైర్మన్ గూటం శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థులు మానేపల్లి వెంకటేశ్వరరావు, వేమన శ్రీనివాసరావు, అడబాల అలివేణి, వరిగొండ పద్మావతి, అయ్యగారి కమల, చింతపల్లి సుజాత, పాక వాలంటీనా, యర్రంశెట్టి అనంతసూర్యరాంబాబు పాల్గొన్నారు.