కన్నీటి చినుకులు

ABN , First Publish Date - 2023-03-19T01:25:55+05:30 IST

అకాల వర్షంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.శనివారం మద్యాహ్నం ఒక్క సారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నా యి.

కన్నీటి చినుకులు
కొవ్వూరులో వాన

జిల్లా అంతటా కురిసిన వాన

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి/ కొవ్వూరు /గోపా లపురం, మార్చి 17 : అకాల వర్షంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.శనివారం మద్యాహ్నం ఒక్క సారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నా యి. సాయంత్రం వరకు వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి అధ్వానంగా తయారయ్యాయి. ఆకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు సూచించారు. జిల్లాలో 32,130 హెక్టార్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం సాగు చేశారు.ప్రస్తుతం కోతలు ఆరంభమయ్యా యి. రాజమహేంద్రవరం రూరల్‌,రాజానగరం ప్రాంతాల్లో ధాన్యం కళ్లాల్లోనూ,పనల మీద ఉంది.ఓ మోస్తరు వర్షం కారణంగా రైతులు ఏర్పాట్లు చేశారు.భారీగా పడితే ప్రమాదమేనని ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు వీయడం వల్ల మామిడి పిందెలు, పూత,జీడి మామిడి పిందెలు, పూత కూడా చాలా చోట్ల రాలిపోయింది.గోపాలపురం మండలం కొవ్వూరు పాడు లో రావూరి సత్తిబాబు ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది.ఆ కొబ్బరి చెట్టు కాలిపోయిం ది.రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని, పంట పొలాల్లో నిలబడిపోయిన నీటిని ఎప్పటికప్పుడు బయటకు తరలించాలని వ్యవసాయ శాఖ కొవ్వూరు ఏడీ పి.చంద్రశేఖర్‌, ఏవో గంగధర్‌లు తెలిపారు. వేళ కాని వేళ వర్షాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల పంటలకు నష్టం కలుగుతుందని వాపోతున్నారు.

Updated Date - 2023-03-19T01:25:55+05:30 IST