పెద్దోళ్ల యాపిల్!
ABN , First Publish Date - 2023-04-03T00:55:20+05:30 IST
పేదోడి యాపిల్ పెద్దోళ్ల ఫలమైంది.నేడు కొనుగోలు చేయా లంటేనే కష్టంగా ఉంది..జామ సాగు లేని రోజు ల్లోనే ధర చాలా తక్కువగా ఉండేది.. జామ సాగు పెరిగింది. .రకరకాల జామ కాయలు సాగు చేస్తున్నారు. ధర మాత్రం అధరహో అనిపిస్తుంది.
పెరిగిన జామకాయల ధరలు
కాయ ఒక్కింటికి రూ.20పై మాటే
యాపిల్‌ను మించి విక్రయాలు
ఎగుమతులు పెరగడమే కారణం
రైతుల వద్దే కిలోల లెక్కన విక్రయం
మార్కెట్‌లో పెరుగుతున్న ధర
వందలాది ఎకరాల్లో సాగు
కడియం/సీతానగరం/గోపాలపురం, ఏప్రిల్ 2: పేదోడి యాపిల్ పెద్దోళ్ల ఫలమైంది.నేడు కొనుగోలు చేయా లంటేనే కష్టంగా ఉంది..జామ సాగు లేని రోజు ల్లోనే ధర చాలా తక్కువగా ఉండేది.. జామ సాగు పెరిగింది. .రకరకాల జామ కాయలు సాగు చేస్తున్నారు. ధర మాత్రం అధరహో అనిపిస్తుంది. పెద్ద సైజు కాయ ఽధర ఒక్కటీ సుమారు రూ.20 లకు విక్రయిస్తు న్నారు.ఒక రెండేళ్ల కిందటి వరకూ డజను కాయల చొప్పున విక్రయించేవారు. మరి నేడు అది కాస్తా కేజీ ల్లోకి వచ్చింది.కేజీ రూ. 50లకు విక్రయిస్తు న్నారు.పెద్ద కాయ లైతే 3 మధ్యస్తంగా ఉంటే 4 కాయలు వస్తు న్నాయి. దీంతో పేదలు జామకాయ కొనాలంటేనే భయ పడిపో తున్నారు..ఎగుమతులు పెరగడంతో జామకా యల ధర పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. లాభసాటిగా ఉండడంతో అధికంగా సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం థాయిలాండ్ రకం సాగు
ఒకప్పుడు భువనగిరి, లక్నో-49, అలహాబాద్ సఫేదా వంటి రకాలను ఎక్కువగా సాగు చేసే రైతులు ప్రస్తుతం వాటితో పాటు ఽథాయిలాండ్ రకంలో వైట్, రెడ్ వెరైటీలను సాగు చేస్తున్నారు. జిల్లాలో కడియం, సీతానగరం, గోపాలపురం తదితర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. జామ పంట (చెట్టు) నాటిన నుంచి ఏడాది కాలానికి ఫలసాయానికి వస్తుంది.దిగుబడి ప్రారంభమైన తరు వాత వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా, వేసవిలో తక్కువ దిగుబడి ఉంటుంది. మూడు నుంచి నాలుగేళ్ల పాటు జామ పంట నుంచి దిగుబడి వస్తుంది. నాటిన ఏడాది తరువాత ఒక్కో చెట్టు రోజుకు 200 నుంచి 300 వరకు కాయలు దిగుబడి నిస్తుందని రైతులు చెబుతున్నారు. చెట్టు ఎదిగే కొద్దీ దిగుబడి పెరుగుతుందని పొట్టిలంక గ్రామానికి చెందిన జామ సాగు చేసే రైతు తెలిపారు.మిగతా సమయాల్లో జామ ధర మెండుగా ఉన్న ప్పటికీ,మామిడి ఫలాల సీజన్‌లో మాత్రం ధర అంతంత మాత్రంగానే ఉంటుంది.జామ సాగుకు భూమి శిస్తు, మొక్కలు వేయడానికి,ఎరువులు, పురుగుమందులు ఇలా ఎకరా ఒక్కంటికి రూ. లక్ష పైమాటే ఖర్చు అవుతుంది.
పొట్టిలంక కేంద్రంగా ఎగుమతులు..
కడియం మండలంలో ప్రధానంగా పొట్టిలంక, దామిరెడ్డిపల్లి, వీరవరం, బుర్రిలంక, మాధవరాయుడుపాలెం, జేగురుపాడు గ్రామాల్లో ఉద్యానశాఖ గణాంకాల ప్రకా రం 18 హెక్టార్లలో రైతులు జామ సాగు చేస్తున్నారు. సీతానగరం మండలంలో సుమారు 80 ఎకరాల లంకభూముల్లో జామ తోటలు ఉన్నాయి. గోపాలపురం మం డలంలో 150 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.అను నిత్యం పొట్టిలంక మార్కెట్ నుండి అమలాపురం, రావులపాలెం, పాలకొల్లు రాజోలు, మార్టేరు వంటి ప్రాంతాలతో పాటు ఇచ్ఛాపురం,పలాస, కాశీబుగ్గ వంటి సుదూర ప్రాంతా లకు జామకాయలు ఎగుమతి అవుతుంటాయి. షుగర్ వ్యాధిగ్రస్థులు సైతం జామ ఆరగించవచ్చని చెబుతుండడంతో డిమాండ్ పెరిగింది. జామ సాగు చేసే రైతుల వద్ద లోడు అంటే సుమారు 400 కాయలు రూ.1500 చొప్పున చిల్లర వర్తకులు కొనుగోలు చేసుకుని కోరుకొండ, రాజానగరం,రాజమహేంద్రవరం తదితర ప్రాం తాలకు తీసుకుని వెళ్లి చిల్లరగా జాయకాయ రూ.5 నుంచి రూ.10లకు విక్రయిస్తారు. కడియంలో అయితే రైతు వద్ద కిలోల లెక్కన వీటిని కొనుగోలు చేస్తున్నారు.కిలో (5 నుంచి 6 కాయలు) సుమారు రూ.30 వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.అయితే వ్యాపారులు మార్కెట్‌లో కాయ ఒక్కంటి రూ.8 నుండి 10 వరకు విక్రయిస్తున్నారు. పేదో డికి అందుబాటులో ఉండే జామ యాపిల్ రేటుతో సమానంగా ఉండటంతో జామను కొనుక్కుందామను కునే వారు ధర చూసి అయ్యబాబోయ్ అంటూ నోరెళ్ళబెడుతున్నారు.
వచ్చే తెగుళ్లు.. నివారణ చర్యలు
వేరుకుళ్లు నివారణకు చెట్టు సైజును బట్టి 5 కేజీల నుంచి 20 కేజీల వరకు వేపపిండితో పాటు ట్రైకోడెర్మావిరిడి అనే మందు చెట్టు మొదలులో వేయాలి. అలాగే కాయదశలో వచ్చే పండు ఈగ నివారణకు ఎకరాకు 20 వరకు లింగాకర్షక బుట్టలు పొలంలో ఏర్పాటు చేయాలి. రెస్ట్ డిసీజ్ నివారణకు జింక్, మాంగనీస్, బోరాన్, ఐరన్ వంటి సూక్ష్మఎరువులను పంటకు వేసుకోవాలి. ఎండు తెగులు నివారణకు గాను కాపర్‌ఆక్సీక్లోరైడ్ మందుతో పాటు కార్బండిజం మందును పంటలో పిచికారీ చేయాలి. ఆగస్టు నెల నుంచి మార్చి నెల వరకు సర్పిలాకార దోమ జామ పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆకు వెనుకభాగంలో తెలుపురంగులో గుడ్లు పెడుతుంది.మొదట పువ్వులను ఆశించి క్రమేపి మొక్క మొత్తాన్ని నాశనం చేస్తుంది. వ్యాధి నివారణకు ఉద్యాన పంటల్లో వేపనూనె 10వేల పీటీ ఎం లీటరుకు 5 మిల్లి లీటరు చొప్పున మొక్క పైభాగంలో పిచికారీ చేయాలి. పసుపురంగు జిగురు అట్టలను ఎకరానికి 25 చొప్పున ఈ ఏర్పాటు చేయాలి.
రైతు మార్కెట్ చేసుకుంటే మరింత లాభం
జామసాగు అంత లాభదాయకంగా లేదు. పెట్టుబడి ఎక్కువ. జామకాయలు నేరుగా దళారీలకు అమ్ముకుని సరిపెట్టుకుందామంటే లాభ ఉండదు. పండించిన పంట నేరుగా మార్కెట్‌కు వెళ్లి వినియోగదారునికి అమ్ముకుంటేనే లాభం. నేను నేరుగా రాజమహేంద్రవరం వెళ్లి అమ్ముకుంటాను.
- సిద్దాల సత్యనారాయణ, జామ రైతు, రాపాక
ఒకేసారి పెట్టుబడి.. నాలుగేళ్ల ఆదాయం
జామసాగు ఎల్-49, సఫేదా వంటి రకాలతో పాటు థాయిలాండ్ రకానికి చెందిన జామ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాకు రైతులు 240 నుంచి 260 మొక్కలు నాటుకోవచ్చు. రైతులకు లాభసాటిగా ఉంటుంది. పెద్దగా పెట్టుబడి లేని పంట. ఒకసారి వేస్తే నాలుగేళ్ల పాటు ఆదాయం ఉంటుంది. రైతులు సక్రమ యాజమాన్య పద్ధతులు పాటించాలి.
- డి.సుధీర్‌కుమార్, ఉద్యాన అధికారి, కడియం