ఘనంగా షష్ఠి వేడుకలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:41 PM
సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను సోమవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొవ్వూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు గోష్పాదక్షేత్రానికి చేరుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
కొవ్వూరు, డిసెంబరు 18: సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను సోమవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొవ్వూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు గోష్పాదక్షేత్రానికి చేరుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సుందరేశ్వరస్వామి ఆలయంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి, సంస్కృత పాఠశాలలోని శ్రీలలితాపార్వతీ సమేత గోష్పదేశ్వరస్వామి ఆలయాల్లో పంచామృత అభిషేకాలు, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. గోదావరి గట్టుపై సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దేవదాయశాఖ ఆధ్వ ర్యంలో షష్ఠి ఉత్సవాలు నిర్వహించారు. రాత్రి స్వా మివారి కళ్యాణం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.