వైభవంగా తిరువాభరణోత్సవం

ABN , First Publish Date - 2023-01-15T01:00:50+05:30 IST

రాజమహేంద్రవరం, జనవరి 14(ఆంద్రజ్యోతి): అయ్యప్పస్వామి తిరువాభరణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు శని వారం ఘనంగా నిర్వహించారు. ఆభరణాలను స్వాముల పర్యవేక్షణలో దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు ఇంటి నుంచి తీసుకువచ్చారు.

వైభవంగా తిరువాభరణోత్సవం

రాజమహేంద్రవరం, జనవరి 14(ఆంద్రజ్యోతి): అయ్యప్పస్వామి తిరువాభరణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు శని వారం ఘనంగా నిర్వహించారు. ఆభరణాలను స్వాముల పర్యవేక్షణలో దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు ఇంటి నుంచి తీసుకువచ్చారు. గురుస్వామి కొమ్ముల సాయు పర్యవేక్షణలో జక్కంపూడి గణేష్‌ తదితరులు సంప్రదాయ వాయిద్యాల మధ్య నగరంలో పలు వీధుల గుండా ఉరేగించి పూజారికి సమర్పించారు. ప్రధానార్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామి వారికి తిరువాభరణం అలంకరించారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ శబరిమలై ఆల యంలో మాదిరిగా ప్రతి ఏడాది తిరువాభరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్‌ విప్పర్తి వేణుగోపాల్‌, నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, మేడపాటి షర్మిళరెడ్డి, ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్‌, సంకిన భవానీప్రియ, అడపా అనిల్‌, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T01:01:34+05:30 IST