గ్రేడ్-1 కమిషనర్‌గా ఏసుబాబు
ABN , First Publish Date - 2023-11-21T00:17:47+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 20: నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబుకు గ్రేడ్-1 కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు పురపరిపాలన
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 20: నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబుకు గ్రేడ్-1 కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు పురపరిపాలనశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్-2 కమిషనర్‌గా ఉన్న ఏసుబాబుకు గ్రేడ్-1 కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడే కార్యదర్శిగా కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్ సీహెచ్.నాగనరసింహారావు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎస్‌ఈ పి.సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి.పృథ్వీచరణ్, డీసీపీ హరిదాస్, మేనేజర్ కర్రి సత్యనారాయణ, టీపీఆర్వో కృష్ణమోహన్ అభినందనలు తెలిపారు.