మీరు విధులకు సిద్ధం కండి
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:45 AM
మునిసిపాలిటీల్లో పారిశుధ్య కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలు అందించాలని సమ్మె చేపట్టడంతో పట్టణాల్లో పారిశుధ్య పర్యవేక్షణ బాధ్యతలను సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పారిశుధ్య కార్మికులు సమ్మెలో..
కొవ్వూరు సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాలు
కొవ్వూరు, డిసెంబరు 30 : మునిసిపాలిటీల్లో పారిశుధ్య కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలు అందించాలని సమ్మె చేపట్టడంతో పట్టణాల్లో పారిశుధ్య పర్యవేక్షణ బాధ్యతలను సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అంగన్వాడీ కారకర్తలు సమ్మెలోకి వెళ్లడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఒకపక్క, మరోపక్క ఆడుదాం ఆంరఽధా బాద్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో పారిశుధ్య పర్యవేక్షణ బాధ్యతను వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించింది. దీంతో ప్రభుత్వం ఊపిరాడనీయకుండా తమకు పనులు అప్పగిస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా పారిశుధ్య పనులు పర్యవేక్షించాలని సచివాలయ కార్యదర్శులకు, సచివాలయ సెక్రటరీల పనితీరును పర్యవేక్షించాలని మున్సిపల్ శానిటరి ఇన్స్‌స్పెక్టర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క సెక్రటరీకి 3 నుంచి 4 క్లస్టర్లను అప్పగించారు. అలసత్వం వహిస్తే సెక్రటరీలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూ రాత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. లక్షలాది రూపాయల వేతనాలను, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలను వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు అని వచ్చిన సచివాలయ సెక్రటరీలకు నిర్ధిష్టమైన విధి విధానాలు వదిలిపెట్టి అదనపు భారాలు మోపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వార్డుల్లో శాని టేషన్ సెక్రటరీలు..శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు మాతో పని ఏమి ఉం టుందని.. మేము ఏమైనా చీపు ర్లు పట్టుకుని ఊడ్చాలా అంటూ సచివాలయ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు.