ప్రభుత్వానికి పట్టదు.. రైతులకు తప్పదు
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:03 AM
మంచి ప్రభుత్వం వస్తుంది తమ కష్టాలు తీరుతాయని రైతులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ రైతు సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యా డు.
కాలువలకు పూడికలు తీయని వైనం.. సాగునీటి కోసం రైతుల పాట్లు
సొంత ఖర్చులతో పందలపాక బోదికాలువలో పూడికతీత పనులు
అనపర్తి, డిసెంబరు 17 : మంచి ప్రభుత్వం వస్తుంది తమ కష్టాలు తీరుతాయని రైతులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ రైతు సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యా డు. ఒక వైపు పంట పండించడానికి పెరిగిన ధరలతో ఒక వైపు, పంట పండినా ప్రకృతి ఏమి చేస్తుందో తెలియని పరిస్థితి, మరో వైపు సాగునీరు అందుతుందో లేదో తెలియని పరిస్థితి ఇలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నష్టాలభారిన పడుతున్నా రైతులు మాత్రం తాము నమ్ముకున్న నేలత ల్లిని వదలలేక ఏ సాయం అందకున్నా వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. గత నాలుగేళ్లుగా పండిన ప్రతి పంట వర్షాలకు తడిసి ముద్దవుతున్నా సాగునీరు అందకపోయినా రైతు మాత్రం ఎవరినీ నిందించలేక తమ ఖర్మ అనుకుంటూనే వ్యవసాయాన్ని సాగిస్తున్నాడు. ఎన్నడూలేని విధంగా గత తొలకరి పంటలోనే సాగునీటికి కటకటలాడిన రైతు దాళ్వా పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నాడు. అన్నీ సక్రమంగా ఉన్నా చివరి భూములకు నీరందని పరిస్థితి ఏర్పడటంతో దాళ్వాలో తమ పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఇక విషయానికి వస్తే సామర్లకోట కెనాల్ నుంచి అనపర్తి ఎర్రకాలువ వంతెనవద్ద ఉన్న తూము నుంచి పందలపాక బోది కాలువ (చానల్ 3) ప్రవహిస్తోంది. ఈ కాలువ అనపర్తి, కొప్పవరం, తొస్సిపూడి, కొమరిపాలెం గ్రామాల మీదుగా పందలపాక గుండా ప్రవహిస్తూ వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఈ కాలువలో పూడికలు తీయకపోవడం అనపర్తిలో ఎక్కువశాతం కాలువ గట్టు ఆక్రమణలకు గురికావడం ప్రతిఒక్కరూ చెత్తను వేయడంతో రైతులకు సాగునీటి సరఫరా జరగ డంలేదు. దాళ్వా పంటకు సరిపడ నీరు అందకపోతే తమ పరిస్థితి ఏమిటో అర్థంకాక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి తమ గోడును విన్నవించుకున్నారు. దీనితో ఆయన ఇరిగేషన్ అదికారులతో చర్చించారు. ప్రస్థుతం పూడిక తీతకు ఎటువంటి అనుమతులు లేనందున తూటు కాడ తొలగించే పనిచేస్తున్న కాంట్రాక్టరును సంప్రదించి రెండు రోజులపాటు పందలపాక బోది కాలువలో పూడిక తీసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పనులతో కనీసం అనపర్తి గ్రామం కూడా పనులు సాగకపోవడంతో రైతులు చేసేది లేక తమ సొంత ఖర్చులతో ఎక్స్‌కవేటర్‌ని ఏర్పాటు చేసుకుని పూడికతీత పనులు చేపట్టారు. అనపర్తి గ్రామ పరిధిలో పూడిక తీత పనులు చేయిం చుకోవడం రైతులకు సవాల్‌గా మారింది. గ్రామ పరిధిలో కాలువ గట్టును ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్న వ్యక్తులు పూడిక గట్టుపైకి వేసేందుకు అభ్యంతరం తెలపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాత్కాలికంగా పూడిక తీత పనులు చేయించుకుంటున్నామని వచ్చే వేసవిలో నైనా పూర్తిస్థాయిలో కాలువలో పూడిక తీయించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రతి ఏటా సాగునీరు అందడం గండంగా మారింది
తాడి వెంకటకృష్ణారెడ్డి రైతు అనపర్తి
పందలపాక బోది కాలువ నుండి పొలాలకు నీరందడం గండంగా మారింది. ప్రభుత్వం పూడిక తీయిస్తుందని ఆశించాం కానీ సొంత ఖర్చుల తో పూడిక తీయించుకోవాల్సి వస్తుంది.