ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు త్వరలో స్వస్తి
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:51 AM
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు అన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు
నిడదవోలు, డిసెంబరు 29: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు అన్నారు. శుక్రవారం నిడదవోలులోని టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాను నిధులను పక్కదారి పట్టిం చిందన్నారు. జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశాడని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తానని చెప్పి కల్తీ మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చేసి, ఎందరో పేదల ప్రాణాలను హరీమనిపించాడన్నారు. కార్యక్ర మంలో కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, కారింకి నాగేశ్వర రావు, కొండా నిర్మల, తన్నీడి బోసు, రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.