‘తాగునీటిని సరఫరా చేయాలి’

ABN , First Publish Date - 2023-03-19T00:22:50+05:30 IST

ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు పగటిపూటే కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని వైస్‌చైర్మన్‌ తెడ్లపు అలేఖ్యరాణి సహా పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం జ రిగిన అత్యవసర సమావేశానికి చైర్‌పర్సన్‌

‘తాగునీటిని సరఫరా చేయాలి’

గొల్లప్రోలు, మార్చి 18: ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు పగటిపూటే కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని వైస్‌చైర్మన్‌ తెడ్లపు అలేఖ్యరాణి సహా పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం జ రిగిన అత్యవసర సమావేశానికి చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు అధ్యక్షత వహించారు. గతంలో అర్థరాత్రి సమయాల్లో తాగునీటి సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడేవారని... ఇప్పుడు ఆ సమస్య తగ్గిందని, ఇక నుంచి అన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లోనే తాగునీరు వచ్చేలా చూడాలని ఆమె సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు. అజెండాలోని అంశాలను ఆమోదించారు. నగరపంచాయతీ పాలకవర్గం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైర్‌పర్సన్‌ మంగతాయారు, వైస్‌ చైర్మన్లు, ఇతర పాలకవర్గ సభ్యులను కమిషనరు సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది సత్కరించారు.

Updated Date - 2023-03-19T00:22:50+05:30 IST