Share News

నష్టపరిహారం అందుతుందా?

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:10 AM

మండల పరిషత్‌ సమావేశంలో సభ్యులు గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 22: మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందా లేదా అనే సందేహం ఏర్పడిందని పలువురు సభ్యులు అన్నారు. గొల్లప్రోలు మండలపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎం పీపీ అరిగెల అచ్చియ్యమ్మ అధ్యక్షతన బడ్జెట్‌ స

నష్టపరిహారం అందుతుందా?

మండల పరిషత్‌ సమావేశంలో సభ్యులు

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 22: మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందా లేదా అనే సందేహం ఏర్పడిందని పలువురు సభ్యులు అన్నారు. గొల్లప్రోలు మండలపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎం పీపీ అరిగెల అచ్చియ్యమ్మ అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం జరిగింది. వైస్‌ఎంపీపీ బత్తిన మంగ మాట్లాడుతూ ఈ క్రాప్‌ సరిగా చేయకపోవడంతో పంటనష్టపోయిన కొందరికి పరిహారం రాని పరిస్థితి ఉందని తెలిపారు. గతేడాది ఇదే పరిస్థితి ఉండడంతో పలువురికి పరిహారం అందలేదని జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు చెప్పారు. గొల్లప్రోలు మండలంలో 3913మంది రైతులకు సంబంధించి 1691.81హెక్టార్లల్లో పంటలకు నష్టం జరిగిందని గుర్తించి రూ.2.80కోట్లు పరిహారంగా అందించాలని ప్రభుత్వానికి నివేదించామని వ్యవసాయాధికారి సత్యనారాయణ తెలిపారు. తుఫాన్‌ కారణంగా అరటి పంట పడిపోయినప్పటికి నష్టాన్ని ఎందుకు నమోదు చేయడం లేదని దుర్గాడ ఎంపీ టీసీ ఆకుల శ్రీను ప్రశ్నించారు. 33శాతం కంటే అధికంగా ఉంటే నమోదు చేస్తున్నామని ఉద్యానవనశాఖాధికారి శైలజ తెలిపారు. ఈ సమయంలో ఏఎంసీ చైర్మన్‌ మొగలి విమలబాబ్జి జోక్యం చేసుకుని పంట నష్టాల నమోదులో ఉదారం ఉండాలని సీఎం ఆదేశించారని గుర్తు చేశారు. మల్లవరం ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి సమీపంలో పీబీసీ(కొత్త)కాలువకు పడిన గండిన యుద్ధప్రాతిపదికన పూడ్చాలని జేసీ, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు చెప్పడంతో తక్షణం పూడ్చామని, ఇప్పుడు శాంక్షన్‌ లేదని, జీఎస్టీ ఉండాలని చెప్పడం ఏమిటని ఏకే మల్లవరం ఉపసర్పంచ్‌ అరిగెల మణిబాబు అధికారులను నిలదీశారు. అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరం అంచనా, 2022-23 సవరించిన అంచనా బడ్జెలను సమావేశం ఆమోదించింది. ఎంపీడీవో డీఎల్‌ఎస్‌ శర్మ, తహశీల్దారు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:10 AM