హమ్మయ్య!

ABN , First Publish Date - 2023-08-02T00:52:38+05:30 IST

గోదావరి తగ్గి.. నష్టం పైకితేలింది.. గోదావరి ఉధృతికి జిల్లా వ్యాప్తంగా లంకగ్రామాలన్నీ నీట మునిగాయి..చేలల్లోకి నీరు వచ్చి చేరింది.. పలు లంక గ్రామాల్లో ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి.

హమ్మయ్య!
ఎప్పుడైనా చూశామా ఇలా : వరద స్వచ్ఛభారత్‌ .. క్లీన్‌గా పుష్కరఘాట్‌

ఒకటో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

సాధారణస్థితికి చేరిన నీటిమట్టం

ఊపిరిపీల్చుకున్న ప్రజానీకం

7.9 లక్షల క్యూసెక్కులు విడుదల

బురదతో నిండిన లంక గ్రామాలు

పంటలకు తీవ్రనష్టం

అంచనాల్లో అధికారులు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

గోదావరి తగ్గి.. నష్టం పైకితేలింది.. గోదావరి ఉధృతికి జిల్లా వ్యాప్తంగా లంకగ్రామాలన్నీ నీట మునిగాయి..చేలల్లోకి నీరు వచ్చి చేరింది.. పలు లంక గ్రామాల్లో ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. అయి తే గోదావరి తమ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది కూడా మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం ఉండడంతో అం తా భయపడ్డారు.ఎందుకంటే ఒకటా రెండా ఏకంగా రెండు వారాల పాటు వరద ఉధృతి కొనసాగింది. అయితే ఎట్టకేలకు గోదారమ్మ శాంతించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ఎగువ భాగంలో వర్షాలు తగ్గ డంతో భద్రాచలం వద్ద నీటి మట్టం బాగా పడిపో యింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం 10.4 అడుగులకు తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద సోమ వారం అర్ధరాత్రి వరకూ అమలులో ఉన్న 1,2 ప్రమాద హెచ్చరికలను ఉప సంహరించుకున్నారు. పోలవరం స్పిల్‌ నుంచి 7,69,998 క్యూసెక్కుల వరద బ్యారేజీ వైపు వస్తోంది.సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను వెనక్కి తీసుకోగా, మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను వెనక్కి తీసుకున్నారు. మం గళవారం రాత్రి 8 గంటలకు బ్యారేజి నుంచి సము ద్రంలోకి 7,90,601 క్యూసెక్కులవరద సముద్రంలోకి విడుదల చేశారు.పాండ్‌లెవల్‌ 13.84 మీటర్లు ఉంది. డెల్టా కాలువలకు 11,500 క్యూసెక్కుల నీటిని వది లేస్తున్నారు.భద్రాచలం వద్ద నీటిమట్టం 28.1 అడు గుకు చేరింది. వరద తగ్గినా లంక గ్రామాల్లో మాత్రం సమస్యలు పెరుగుతాయి..ఇళ్లన్నీ బురదతో నిండిపో తాయి. రాజమహేంద్రవరంలోని బ్రిడ్జిలంక, కేతావారి లంక, ఎదుర్లమ్మలంక వంటి ప్రాంతాల్లోని ఇళ్లు ముంపులోనే ఉంటాయి.ఈ వరద తాకిడికి ఇళ్లు మొత్తం నీటిలో తడిచిపోయి సామగ్రి కొట్టుకుపో తోంది. ప్రస్తుతం వరద తగ్గడంతో లంక గ్రామాల ప్రజలు తమ ఇళ్లకు బయలుదేరారు. అయితే అక్కడ ఎలా ఉండాలనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే ప్రస్తు తం వంట చెరుకు ఉండదు.. పశువులకు మేత ఉండదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొంత మంది ఉండిపోయారు. ఈ సీజన్‌ అంతా మాకు కష్టాలు తప్పవని వాపోయారు.

నీట మునిగిన పంటలు..

గోదావరి పరీవాహక గ్రామాల్లో పంటలకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. వరిపంట ఇంకా ముంపులోనే ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు నీటి విడుదల తగ్గిస్తే ముని గిన పంట తేలుతుందని రైతులు అంటున్నారు. జిల్లాలో 818.70 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్టు ప్రాఽథమిక అంచనా వేశామని అధికారులు తెలిపారు. అరటి,కూరగాయలు, కోకో వంటి పంటలు మునిగిపోయాయి. అరటి 556.20 హెక్టార్లు, కూరగాయలు 202.70 హెక్టార్లు, పువ్వులు 4 హెక్టార్లు, బొప్పాయి 6 హెక్టార్లు, కోకో 22 హెక్టార్లు, నర్సరీలు 2హెక్టార్లలోనూ నష్టపోయి నట్టు తెలిపారు. మొత్తం 1580 మంది రైతులు నష్టాలపాలైనట్టు తెలిపారు. వీటికి రూ.3 కోట్ల 45 లక్షల 22 వేల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అంచనా వేశారు.

ఎలా ఉండాలో గోదారమ్మ చెప్పింది!

ఈ ఘాట్లు చూశారా.. అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తుంది కదూ.. వారం రోజుల కిందట చూసుంటే వాంతి చేసుకోవాల్సిందే.. అప్పుడే కాదు.. ఎప్పుడు చూసినా అంతే.. కనీస శుభ్రత ఉండదు.. అక్కడే తింటారు.. అక్కడే పడేస్తారు.. ప్లాస్టిక్‌ కవర్లు, చెత్త చెదారంతో నిండి ఉంటాయి.. పేరుకు ప్రసిద్ధి అయినా పర్యవేక్షణ లోపంతో అపరిశుభ్రత తాండవిస్తోంది.. ఆ ఘాట్లు ఏమిటో ఈ పాటికే గుర్తుపట్టి ఉంటారు. ఒకటి రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌.. జిల్లాలో ఈ ఘాట్‌ గురించి దాదాపు తెలియనివారుండరు.. రెండు వంతెనల మధ్య ఎంతో అందం. ఆకర్షణగా ఉంటుంది.. ఒక పక్క రైలు వంతెన.. మరో పక్క హేవలాక్‌ బ్రిడ్జి..ఆ రెండు బ్రిడ్జిల మధ్య నుంచి గోదావరిని ఎంత సేపు చూసినా తనివితీరదు.. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందుకే ఈ ఘాట్‌ అంత ప్రసిద్ధి.. మరొకటి కొవ్వూరు గోష్పాదక్షేత్రం.. ఆ క్షేత్రం గురించి తెలియని వారుండరు. ఈ రెండు ఘాట్లు ఎప్పుడూ అపరిశుభ్రమే.. గోదావరి వరదొచ్చినా ఎప్పుడూ బురదతో నిండిపోయేది.. అయితే ఈ సారి మాత్రం గోదావరి మాత.. తనతో బురదను తీసుకుపోయింది... ఇలా ఘాట్లన్నీ శుభ్రం చేసేసింది.. అలా కాదు.. ఇలా ఉండాలని చెప్పకనే చెప్పింది.. అయ్యా అధికారులు.. నాయకులు ఇకనైనా ఆ దిశగా అడుగులేయండి మరి..

- ఫొటోగ్రాఫర్‌, రాజమహేంద్రవరం

Updated Date - 2023-08-02T00:52:38+05:30 IST