పిల్లల్లో సృజన వెలికితీసేందుకు ‘గోదావరి బాలోత్సవం’

ABN , First Publish Date - 2023-02-07T01:19:52+05:30 IST

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరంలోని హోటల్‌ జగదీశ్వరిలో గోదావరి బాలోత్సవం బ్రోచర్‌ ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్సీ సాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 25,

పిల్లల్లో సృజన వెలికితీసేందుకు ‘గోదావరి బాలోత్సవం’
గోదావరి బాలోత్సవం బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, ఇతర ప్రముఖులు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 6 : పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరంలోని హోటల్‌ జగదీశ్వరిలో గోదావరి బాలోత్సవం బ్రోచర్‌ ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్సీ సాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 25, 26 తేదీల్లో జరిగే ‘గోదావరి బాలోత్సవం’ ఘనంగా నిర్వహించాలని సూచించారు. నిర్వహణ కమిటీ నుంచి తులసి తదితరులు పాల్గొన్నారు. కాగా బాలోత్సవం ఆహ్వాన కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీ గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, గౌరవ సలహాదారుగా వి.భాస్కరరామ్‌, అధ్యక్షులుగా తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు, గౌరవ సలహాదారులుగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఓఎన్జీసీ మాజీ ఈడీ డీఎంఆర్‌ శేఖర్‌, ప్రధాన కార్యదర్శిగా పీఎస్‌ఎన్‌ రాజులను నియమించారు.

Updated Date - 2023-02-07T01:19:53+05:30 IST