గాడ్ జన్మదిన వేడుకలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-01-18T00:22:27+05:30 IST
కార్మిక యూనియన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన గళ్లా రామును
రాయవరం, జనవరి 17: వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ 87వ జన్మదిన వేడుకలు మంగళవారం గాడ్ కుమార్తె సత్యవెంకట కామేశ్వరి జ్యోతిప్రజ్వలన చేయడంతో ప్రారంభమయ్యాయి. మూడురోజులు జరిగే వేడుకల్లో తొలిరోజు తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి దేవస్థానం అర్చకులు గోపీ గురుకుల్ ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా పీఠాధిపతి గాడ్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం తిలకించడం వల్ల సంతానప్రాప్తి, శతృజయం కలుగుతాయన్నారు. సాయంత్రం పార్వతి, కపోతేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో బాబి, విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు గాదే భాస్కరనారాయణ, బి.రమ, పి.సత్యకనకదుర్గ భక్తులు పాల్గొన్నారు.