తేలుకుట్టి బాలిక మృతి

ABN , First Publish Date - 2023-09-21T23:30:13+05:30 IST

ఒకటో తరగతి చదువుతున్న బాలిక తేలు కాటుకు గురై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గోకవరం మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన నూకపర్తి తబిత(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.

తేలుకుట్టి బాలిక మృతి

జీజీహెచ్‌(కాకినాడ), సెప్టెంబరు 21: ఒకటో తరగతి చదువుతున్న బాలిక తేలు కాటుకు గురై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గోకవరం మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన నూకపర్తి తబిత(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. బాలిక బుధవారం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా తేలు కాటుకు గురైంది. కాకినాడ జీజీహెచ్‌కు ఆమెను తరలించారు. అక్కడ పిడియాట్రిక్స్‌ విభాగంలో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తబిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. తబితకు తండ్రి శ్రీను, తల్లి ప్రశాంతి ఉన్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

Updated Date - 2023-09-21T23:30:13+05:30 IST