గ్యాస్ సిలెండర్ పేలి ఇల్లు దగ్ధం
ABN , First Publish Date - 2023-05-23T01:21:02+05:30 IST
కొవ్వూరు, మే 22: అగ్ని ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలిని ఏఎస్‌ఐ ఒకరు సుర క్షితంగా తరలించిన వైనమిది. సోమవారం కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో లింగంగొంటి సంతోషమ్మ వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసు, ఫైర్ అధికారులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలం లో గాయపడి సొమ్ముసిల్లి పడిపోయిన
సొమ్మసిల్లిపడి గాయపడిన వృద్ధురాలిని రక్షించిన పట్టణ ఏఎస్‌ఐ
కొవ్వూరు, మే 22: అగ్ని ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలిని ఏఎస్‌ఐ ఒకరు సుర క్షితంగా తరలించిన వైనమిది. సోమవారం కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో లింగంగొంటి సంతోషమ్మ వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసు, ఫైర్ అధికారులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలం లో గాయపడి సొమ్ముసిల్లి పడిపోయిన వృద్ధురాలిని పట్టణ ఏఎస్‌ఐ జీజీ ప్రకాష్ చేతులపై ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందజేశారు. ఫైర్ అధికారు లు ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వడంతో రూ.32 వేల నగదు, సామాన్లు, బట్టలు వంటివన్నీ కాలిపోయాయి. ప్రభుత్వం వృద్ధురాలికి ఇల్లు నిర్మించాలని, అన్నివిధాలుగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.