గరుడ వాహనంపై నరసన్న గ్రామోత్సవం
ABN , First Publish Date - 2023-03-05T02:25:06+05:30 IST
నరసన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి,అమ్మవారితో కలిసి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
కోరుకొండ, మార్చి 4: నరసన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి,అమ్మవారితో కలిసి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక రథంపై నాలుగు మాఢవీధుల్లో విహరించారు. గరుడ వాహనంలో ఆశీనులైన లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తులు నైవేధ్యాలు, మంగళహారతులు సమర్పించారు. కార్యక్రమంలో పరాసర రంగరాజ భట్టర్, పెద్దింటి చంటిబాబు ఆచార్యులు, పెద్దింటి రంగాప్రసాద్ ఆచార్యులు, వాడపల్లి నాగు ఆచార్యులు, శేషుఆచార్యులు, గ్రామపెద్దలు, పాల్గొన్నారు.