గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2023-03-05T00:53:25+05:30 IST
అక్రమ సంపాదనకు అలవాటుపడి గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ రజినీకుమార్ సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. రావులపాలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ రావులపాడు శివారు పూనేటివారి చెరువు వద్ద గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రావులపాలెంరూరల్, మార్చి 4: అక్రమ సంపాదనకు అలవాటుపడి గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ రజినీకుమార్ సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. రావులపాలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ రావులపాడు శివారు పూనేటివారి చెరువు వద్ద గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ సురేంద్ర, డిప్యూటీ తహశీల్దార్ రాంబాబు పాల్గొన్నారు.