గాలి వాన భీభత్సం...
ABN , First Publish Date - 2023-05-12T00:53:43+05:30 IST
ఏజెన్సీలోని ఎటపాక, అడ్డతీగల మండలాల్లో గురువారం గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూ డిన భారీ వర్షం కురిసింది. చెట్లు నేలకూలాయి.
విరిగిన విద్యుత్ స్తంభాలు, నేలకూలిన చెట్లు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఇబ్బందిపడ్డ ప్రయాణికులు
ఎటపాక/అడ్డతీగల, మే 11 : ఏజెన్సీలోని ఎటపాక, అడ్డతీగల మండలాల్లో గురువారం గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూ డిన భారీ వర్షం కురిసింది. చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎటపాక మండలంలో పలు ప్రాంతాల్లో గాలిదుమారం దాటికి బుట్టాయిగూడెంవద్ద రెండుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. బుట్టాయిగూడెం శివాలయం సమీపంలో తాటిచెట్టు నేల కూలింది. అలాగే వీరాయిగూడెం, పురుషోత్తపట్నం, చోడవరం, మంగువాయి తదితర చోట్ల విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దాంతో విలీన మండలాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది లైన్లపై పడ్డ చెట్లకొమ్మలను తొలగించి, విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.
అడ్డతీగలలో భారీ వర్షం
మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. గురువారం ఉదయం నుంచి గాలులు, వర్షం కురవడంతో ప్రజలు సేద తీరారు. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతోకూడిన భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడే చెట్లుకూలి విద్యుత్ లైన్లపై పడడంతో విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రవాణా సౌకర్యం, విద్యుత్ లేక ప్రజ లు పలు ఇబ్బందులకు గురయ్యా రు. విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రతి పాదికన విద్యుత్ పునరుద్ధరించ డానికి కృషి చేస్తున్నారు. అదేవిధ ంగా రహదారు లపై పడిన వృక్షాలను తొలగిస్తున్నారు.
పిడుగుపాటుకు యువకుడు మృతి
సామర్లకోట, మే 11: గురువారం సాయంత్రం వర్షానికి తోడు పిడుగులు పడడంతో కాకినాడజిల్లా సామర్లకోట గణపతినగరానికి చెందిన ప్రకృతి శ్రీను(22) అనే యువకుడు చికిత్స పొందుతూ సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. శ్రీను డిగ్రీ ఉత్తీర్ణుడై సివిల్స్‌కు ప్రిపేరవుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. సామర్లకోటకు చెందిన శ్రీను తన సహచరులతో కలిసి సమీపంలో ఉన్న రాజుపాలెం ఏలేరు చెక్‌డ్యామ్ వద్దకు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. సాయంత్రం ఒక్క సారిగా ఉరుములు, మెరుపుల కారణంగా శ్రీను సమీపంలో చెట్టునీడకు వెళ్లగా మిగిలిన స్నేహితులు ఏలేరు కాలువ గట్టుకు చేరుకున్నారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో తీవ్ర విద్యుద్ఘాతంతో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కొన ఊపిరితో ఉన్న శ్రీనును చికిత్స నిమిత్తం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సామర్లకోట వైద్యులు చికిత్స ప్రారంభించబోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు శ్రీను తండ్రి ప్రకృతి ఈశ్వరరావు తాపీమేస్త్రీగా పనిచేస్తూ సీఐటీయూ కార్మికసంఘ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెలు కాగా ఈశ్వరరావు, వెంకటలక్ష్మీ దంపతులకు మృతుడు శ్రీను ద్వితీయ కుమారుడు. డిగ్రీ ఉత్తీర్ణుడైన తమ కుమారుడు సివిల్స్ ద్వారా ఉన్నతోద్యోగం సాధిస్తాడని ఎంతో ఆశపడ్డాం అని తల్లిదండ్రులు ఈశ్వరరావు, వెంకటలక్ష్మీలు బోరున రోధించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం పెద్దాపురం పోలీస్టేషన్‌కు చెందినది కావడంతో సామర్లకోట పోలీసులు కేసును పెద్దాపురం పోలీసులకు అప్పగించినట్లు సామర్లకోట పోలీసులు తెలిపారు.
పిడుగుపాటుకు మూడు పశువులు మృతి
ఎటపాక: పిడుగుపాటుకు మూడు పశువులు మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం అల్లూరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీలోని పట్టుచీర గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టుచీర గ్రామానికి చెందిన ఇర్పా ముత్తయ్య రెండు పశువులు, తెల్లం రంగారావుకు చెందిన ఒక పశువు సాయంత్రం సమయంలో వర్షం పడుతుండగా పశువులు చెట్టు కిందకు వెళ్లాయి. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపడడంతో చెట్టు కింద ఉన్న పశువులు మృతి చెందాయి. మృతి చెందిన పశువుల విలువ రూ. 80 వేల వరకు ఉంటుందని యజమానులు తెలిపారు.