నిధుల కేటాయింపుపై వైసీపీ వివక్ష

ABN , First Publish Date - 2023-05-27T00:31:28+05:30 IST

బీజేపీ గెలిచిన వార్డులకు నిధుల కేటాయింపుపై వైసీపీ వివక్ష చూపుతోందని కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ విమర్శించారు. శుక్రవారం కొవ్వూరులోని 9వ వార్డులో సామయాజుల ఆసుపత్రి నుంచి శాఖా గ్రంథాలయం వరకు డ్రైనేజీలను ఆయన పరిశీలించారు.

నిధుల కేటాయింపుపై వైసీపీ వివక్ష

  • బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ

కొవ్వూరు, మే 26: బీజేపీ గెలిచిన వార్డులకు నిధుల కేటాయింపుపై వైసీపీ వివక్ష చూపుతోందని కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ విమర్శించారు. శుక్రవారం కొవ్వూరులోని 9వ వార్డులో సామయాజుల ఆసుపత్రి నుంచి శాఖా గ్రంథాలయం వరకు డ్రైనేజీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటాలు తప్ప, ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. సాక్షాత్తు బీజేపీ కౌన్సిలర్‌ ఇంటి ముందు రెండు నెలలుగా డ్రైనేజీ కల్వర్టు పాడైపోయి, మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోందని కౌన్సిల్‌ సమావేశం, వ్యక్తిగతంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. మురుగునీరు పారక దోమలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు ప్రబలుతాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమి రాధాకృష్ణ, కాలెపు సాయిరాం, బూసి సురేంద్రనాథ్‌ బెనర్జి, మడిచర్ల రామచంద్రరావు, కొండపల్లి రత్నసాయి, సాయిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:31:28+05:30 IST