టెన్షన్‌..టెన్షన్‌!

ABN , First Publish Date - 2023-03-31T00:42:57+05:30 IST

అమ్మో ఒకటో తేదీ.. ఇదీ మిగిలిన 11 నెలల లెక్క.. ఆర్థిక ముగిసే సమయంలో మాత్రం అమ్మో 31వ తేదీ.. ఎందుకంటే 31వ తేదీలోపు ఏ బిల్లులు అప్‌లోడ్‌ అవుతాయో అవే ఈ ఏడాది బడ్జెట్‌లో వసూళ్లవు తాయి.

 టెన్షన్‌..టెన్షన్‌!

స్లోగా సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌

అప్‌లోడ్‌ కాని బిల్లులు

జీతాల బిల్లులదీ అదే దారి

కాంట్రాక్టర్ల బిల్లులు సరే సరి

నేడు క్లియర్‌ అయితేనే చేతికొచ్చేది

లేదంటే విడుదలకు షాకే..

ఆందోళనలో కాంట్రాక్టర్లు

అయోమయంలో ఉద్యోగులు

31వ తేదీపైనే అందరి ఆశలు

అమ్మో ఒకటో తేదీ.. ఇదీ మిగిలిన 11 నెలల లెక్క.. ఆర్థిక ముగిసే సమయంలో మాత్రం అమ్మో 31వ తేదీ.. ఎందుకంటే 31వ తేదీలోపు ఏ బిల్లులు అప్‌లోడ్‌ అవుతాయో అవే ఈ ఏడాది బడ్జెట్‌లో వసూళ్లవు తాయి. లేదంటే వచ్చే ఏడాది బడ్జెట్‌లోకి వెళ్లిపోతాయి. అదే జరిగితే బిల్లుల వసూళ్లకు ఎంతకాలం పడు తుందనేది చెప్పడం కష్టమే.. ఇక ఉద్యోగుల జీతాలదీ ఇదే పరిస్థితి.. మూడు రోజుల కిందటి వరకూ సీఎఫ్‌ ఎంఎస్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో అటు కాం ట్రాక్టర్లు.. ఇటు ఉద్యోగుల్లో తీవ్ర టెన్షన్‌ నెలకొంది.

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

మార్చి 31వ తేదీ టెన్షన్‌ పీడిస్తోంది. ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగుస్తుందనే సంగతి తెలిసిందే. ట్రెజరీల ద్వారా శుక్రవారం ఎన్ని బిల్లులు ఆమోదం పొందితే అవే నగదుగా మారతాయి. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కారణంగా అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లలో తీవ్ర టెన్షన్‌ పెరిగిపోయింది. బీపీ బిల్లలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకంటే జీతాలైనా ఏ పనులకు సంబంధించిన బిల్లులైనా, పెండింగ్‌ బిల్లులైనా సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌ లోడు చేయాలి. సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ పనిచేయడంలేదు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెల 23వ తేదీకే అప్‌లోడ్‌ అవుతాయి. ఈ వెబ్‌సైట్‌ చాలా రోజులుగా మూతపడి ఉంది. సోమవారం రాత్రి నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే బిల్లులు అప్‌లోడ్‌ అవ్వడంలేదు. రాత్రి పగలు కష్టపడుతూ కంప్యూటర్ల వద్దే కూర్చుని డీడీవోలు, ఇతర బిల్లులు అప్‌లోడ్‌ చేసే వారు నానాతంటాలు పడుతున్నారు. జిల్లాలో జీతాలతో పాటు వందల కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. ఎక్కువ శాతం అప్‌లోడ్‌ కాకపోవడంపై ఆందోళన చెందుతు న్నారు. శుక్రవారం రాత్రి లోపు ఎన్ని బిల్లులు క్లియర్‌ అయితే అవే ప్రాప్తం. లేకపోతే ఏప్రిల్‌ 1నుంచి మొదలయ్యే కొత్త బడ్జెట్‌ నుంచి ఈ బిల్లులను క్లియర్‌ చేయవలసి ఉంటుంది. జీతాలు బిల్లులు ప్రస్తుతం అప్‌లోడ్‌ కాకపోతే ఏప్రిల్‌లో జీతాలు వచ్చే అవకాశాలు తక్కువని కొందరు వాదిస్తున్నారు. వాటిని కొత్త బడ్జెట్‌ కేటాయింపుల్లో పెట్టి డ్రా చేసుకోవాల్సి ఉంటుం ది. ఈలోగా అప్‌లోడ్‌ అయితే మాత్రం కొంత ఆలస్యమైనా జీతాలు వస్తాయి.

రూ.కోట్లలో పెండింగ్‌ బిల్లులు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.వందల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇరిగేషన్‌లో రూ.16 కోట్లకు పైగా ఒక విభాగంలో పెండింగ్‌ ఉన్నాయి. కొందరు కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లి వసూలు చేసుకోవడంతో ఈ మొత్తం తగ్గింది. ఓఅండ్‌ఎం పనులకు సంబంఽఽధించి రూ.3 కోట్ల వరకూ బకాయి ఉంది. ఆర్‌అండ్‌బీలో కూడా ఎక్కువ ఉంది. పంచాయతీరాజ్‌లో రూ.30 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో సుమారు రూ.16 కోట్లు, పబ్లిక్‌ హెల్త్‌లో స్టార్మ్‌వాటర్‌ డ్రెయిన్‌కు సంబంధించే సుమారు రూ.40 కోట్ల వరకూ ఉన్నట్టు సమాచారం. ఆసియన్‌ ఇన్‌ఫ్రా ఇప్లిమెంటేషన్‌ పథకం ద్వారా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని పలు మునిసిపాలిటీల్లో గోదావరి నీటిని సరఫరా చేసే పనులు ప్రారంభించారు. అవి కూడా నీరసంగా సాగుతున్నాయి. ఇక నవరత్నాల పథకాల కింద హౌసింగ్‌, నాడునేడు వంటి పనుల బిల్లులు సంగతి చెప్పనవసరమే లేదు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు తప్ప అభివృద్ధి పనులు ఏమీ లేకపోవడంతో కొత్త కాంట్రాక్టర్లలేరు. గతంలో చేసిన పనులు, గతంలో మొదలైన పనులకు సంబంధించిన బిల్లులే ఇవ్వడంలేదు. రాజమహేంద్రవరం కార్పొరేష న్‌కు గతంలో రూ.125 కోట్ల ప్రత్యేక గ్రాంటు ఇచ్చిన నట్టు ప్రజాప్రతినిధులు గొప్పగా ప్రకటించారు. కానీ ఒక పైసా కూడా రాలేదు. సాధారణ నిధుల నుంచి అనుమతి తెచ్చుకుని కొన్ని పనులు చేస్తున్నారు. వాటికి కూడా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఇంకా ఏడీబీ రోడ్డు, పోలవరం ఎడమ కాలువ, సీతానరం రోడ్డు తదితర పనులకు సంబంఽధించి బిల్లులు పెం డింగ్‌ ఉన్నాయి. ఇంకా పంచాయతీలు, జడ్పీ, కలెక్టరేట్‌ ద్వారా చేసిన పనులు,ఆయా పాఠశాలలకు సంబంధించిన బిల్లులు, పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసిన మహిళలు బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. వైద్యరంగంలో కూడా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసు, వైద్యం వంటి రంగాలకు ముందుగా జీతాలు పడే అవకాశం ఉంది. పెన్షన్ల మూడో తేదీన ఇస్తామని ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదైనాసమయం పాటిస్తారో ఆలస్యమవుతుందో చూడాలి మరి.ఒక గురువారం రాత్రి సీ ఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ పనిచేసి ఎక్కువ బిల్లులు అప్‌లోడ్‌ అయినా ట్రెజరీ అధికార్లకు టెన్షన్‌ పెరుగుతుంది. అక్కడ ఒత్తిడి వల్ల శుక్రవారం క్లియర్‌ అవు తాయో లేవో చూడాలి మరి. అలా జరిగితే కాంట్రాక్టర్లు, ఉద్యోగుల ఆశలు నెరవేరినట్టే.. లేదంటే అడియాశగా మిగులుతుందని అందరినీ టెన్షన్‌ పీడిస్తోంది.

Updated Date - 2023-03-31T00:42:57+05:30 IST