పెద్ద దోపిడీ!
ABN , First Publish Date - 2023-01-15T00:32:32+05:30 IST
కూరగాయల ధరలపై పెద్ద పండుగ ప్రభావం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ పెద్దలకు పెట్టడానికి కూరగాయలను తప్పని సరిగా కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో పెద్ద దోపిడీకి తెగ బడ్డారు.ఒక్కో రకం కేజీ సుమారు రూ.20 నుంచి రూ.40లు పైనే విక్రయించడం గమ నార్హం.
ఒక్కరోజులోనే డబుల్
కేజీకి రూ.20 నుంచి రూ.40 పెంపు
అన్ని కూరగాయలదీ ఇదే పరిస్థితి
కొనుగోలుదారుల బెంబేలు
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 14 : కూరగాయల ధరలపై పెద్ద పండుగ ప్రభావం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ పెద్దలకు పెట్టడానికి కూరగాయలను తప్పని సరిగా కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో పెద్ద దోపిడీకి తెగ బడ్డారు.ఒక్కో రకం కేజీ సుమారు రూ.20 నుంచి రూ.40లు పైనే విక్రయించడం గమ నార్హం. నిన్నటి వరకూ రూ.30లు చిక్కుడు కాయల ధర శనివారం బహిరంగ మార్కె ట్‌లో రూ.100 లకు విక్రయించారు.ఇదేంటని వ్యాపారులను ప్రశ్నిస్తే హోల్‌సేల్ వ్యాపారులు ఒక్కసారిగా ధరలను పెంచేశారని చెబుతున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పండగ వేళ కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో పరేషాన్ అవుతున్నారు. రాజమహేంద్రవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ధరల ప్రభావం కనిపిస్తోంది.ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో దొమ్మేరు రకం వంకాయలు కిలో రూ.70 నుంచి రూ.80లకు విక్రయిస్తుంటే బెండకాయలకు కూడా దాదాపుగా ఇదే రేటు పలుకుతోంది.దొండకాయలు కిలో రూ.50, బీరకాయలు రూ.70, టమాటా రూ.25, వంకాయలు తెలుపు చారలు రూ.60, కణుపు చిక్కుళ్లు రూ.100 ... ఇలా అన్ని రకాలు కూరగాయల ధరలు పైకి చూస్తున్నాయి. పచ్చిమిర్చి ధర కూడా పెరిగింది.కిలో రూ.50ల వరకూ విక్రయిం చారు. బహిరంగ మార్కెట్లలో ధరలను చూసి సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, బహిరంగ మార్కెట్‌తో పోల్చితే రైతుబజార్లలో ధరలు కాస్త తక్కువగానే ఉన్నట్టు కనిపించినా ఇక్కడ కూడా ధరల మోత మోగుతోంది. రైతుబజార్లలో దొమ్మేరు వంకాయలు కిలో రూ.54, తెలుపు చార రూ.40, గులాబీ రూ.40, బెండకాయ రూ.62, బీరకాయ రూ.38, దొండకాయ రూ.38, చేమ దుంపలు రూ.50లుగా ఉన్నాయి. కంద రూ.32లకు విక్రయిస్తున్నారు. రెండు, మూడు రోజుల కిందట ధరలు కాస్త తక్కువగానే ఉన్నా పండగ దగ్గర పడగానే కూరగాయల ధరలన్నీ క్రమేపీ పెంచేశారు. ఆనబకాయ ఒకటీ రూ.40ల పైనే ధర పలుకుతోంది. పెద్ద పండగ సంక్రాంతి రోజున ఎక్కువ మంది తమ పెద్దల పేరు చెప్పి స్వయం పాకం ఇస్తారు. లేదంటే కలగూర వండుతారు. ఇదే అదు నుగా ధరలు పెంచేశారు. ఒక్కో రకం పావు కిలో చొప్పున వేసినా 11 రకాలకు రూ. 200 సరిపోలేదని ఒక వినియోగదారుడు వాపో యాడు. అంటే ధరలు ఏ స్థాయిలో పెంచేశారో అర్ధం చేసుకోవచ్చు. నిన్నటి వరకూ తక్కువగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెంచే యడంతో కొనుగోలుదారులు దిక్కులు చూస్తున్నా రు. కొందరు హోల్‌సేల్ వ్యాపారులు కూరగాయల ధరల పెరుగుదలను మరోరకంగా విశ్లేషిస్తున్నారు. పండుగ సమయాల్లో పంట కోతలకు కూలీలు రాక.. కూరగాయల లభ్యత తగ్గి ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.ఈ పరిస్థితి వారం, పదిరోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఒక్క రోజులోనే ధరలు డబుల్ పెంచడంపై సాఽధారణ ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.