కౌలురైతుల నిరసన

ABN , First Publish Date - 2023-06-03T00:03:59+05:30 IST

తాళ్లరేవు, జూన్‌ 2: కౌలురైతు గుర్తింపుకార్డులకు భూయజమానులు అంగీకరిస్తేనే వ్యవసాయం సాగుచేస్తామని లేకుంటే సాగుకు దూరంగా ఉంటామని కౌలు రైతులు నిరసన తెలిపారు. శుక్రవారం మండలంలోని జార్జీపేట, నీలపల్లి గ్రామాల కౌలురైతులు జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు అధ్యక్షతన సమావేశమయ్యా

కౌలురైతుల నిరసన
జార్జీపేటలో నిరసన తెలుపుతున్న కౌలురైతులు

తాళ్లరేవు, జూన్‌ 2: కౌలురైతు గుర్తింపుకార్డులకు భూయజమానులు అంగీకరిస్తేనే వ్యవసాయం సాగుచేస్తామని లేకుంటే సాగుకు దూరంగా ఉంటామని కౌలు రైతులు నిరసన తెలిపారు. శుక్రవారం మండలంలోని జార్జీపేట, నీలపల్లి గ్రామాల కౌలురైతులు జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు అధ్యక్షతన సమావేశమయ్యారు. ప్రభుత్వం అందించే రాయితీలు సాగుచేసే కౌలు రైతుల కే అందివ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వ్యవసాయా లు వదిలేసి కూలీపనికి వెళ్లిపోతామని హెచ్చరించారు.

ఉపాధి కూలీల ధర్నా

ఉపాధిహామీ కూలీలకు కనీస సౌకర్యాలు, వేతనాలను కల్పించాలని కోరుతూ వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని సచివాలయాల వద్ద శుక్రవారం ఉపాధి కూలీలు ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలను అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:03:59+05:30 IST