రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2023-01-18T00:21:28+05:30 IST

రబీ వరిపైరును కాండం తొలుచు పురుగు, జింకు ధాతులోపం కనిపిస్తుందని, రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి కె.నాగేశ్వరరావు సూచించారు.

రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ముమ్మిడివరం, జనవరి 17: రబీ వరిపైరును కాండం తొలుచు పురుగు, జింకు ధాతులోపం కనిపిస్తుందని, రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి కె.నాగేశ్వరరావు సూచించారు. ముమ్మిడివరం మండలం గేదెల్లంక, కొమానపల్లి గ్రామాల్లో సాగుచేసిన వరి పొలాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ఎంటీయూ-1121, ఎంటీయూ-3626 రకాలు రైతులు సాగుచేశారని, వరినాట్లు పూర్తిచేసి 30నుంచి 40రోజులు అయ్యిందని, వరిపైరులో కాండం తొలుచుపురుగు ఆశించినట్టు గుర్తించామన్నారు. కాండం తొలిచే పురుగు నివారణకు క్లోరోజన్‌ 60నుంచి 80ఎంఎల్‌ మందును ఎకరానికి 200లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని వరిపైరుపై పిచికారీ చేయాలన్నారు. . రైతులు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఆయన వెంట సహాయ వ్యవసాయ సంచాలకులు రాజశేఖర్‌, ఏవోఎస్‌. ప్రశాంత్‌కుమార్‌, గ్రామవ్యవసాయ సహాయకులు సియోనురాజు, గ్రామ ఉద్యాన సహాయకులు రామ్‌ప్రసాద్‌, రైతులు ఉన్నారు.

Updated Date - 2023-01-18T00:21:30+05:30 IST