ఎక్స్‌పైరీ అయినా వాడేయవచ్చు...
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:16 AM
ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ డేట్ ఎందుకిస్తారు.. ఆ డేట్ తరువాత దానికి వాడకూడ దని.. అయితే మన అధికారు లకు మాత్రం అదేం పట్టదు..
తాళ్ళపూడి, డిసెంబరు 16 : ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ డేట్ ఎందుకిస్తారు.. ఆ డేట్ తరువాత దానికి వాడకూడ దని.. అయితే మన అధికారు లకు మాత్రం అదేం పట్టదు.. పోతే పోయేది పేదలే కదా అన్నట్టు ఉంటారు.. కళ్లప్పగించి నిద్దరోతారు. తాళ్ళపూడి మండలంలో బడిపిల్లలకు సరఫరా చేసే రాగి పిండి ప్యాకెట్లు ఎక్స్‌పైరీ అయిన తర్వాత పంపిణీ చేశారు. పోషకాహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉండగా గతంలో పురుగులు పట్టిన ఖర్జూరం, నాసిరకం గుడ్లు, పాడైపోయిన పాల ప్యాకెట్లు సరఫరా చేశారు. ఇప్పుడు ఏకంగా ఎక్స్‌పైరీ అయిన రాగిపిండి ప్యాకెట్లు సరఫరా చేశారు.ఇదేమని పంపిణీదారుడిని ప్రశ్నిస్తే పిల్లలకేగా పర్వాలే దులే..ఒక్క నెలకేం కాదులే..అయినా మేమేం చేస్తాం వచ్చినవే ఇస్తాం అంటూ మండిపడ్డాడు.