మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డిని విమర్శించే అర్హత ఎమ్మెల్యేకు లేదు

ABN , First Publish Date - 2023-02-02T01:39:32+05:30 IST

మండలంలోని రామవరం గ్రామంలో టీడీపీ, వైసీపీ హాయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి విసిరిన చాలెంజ్‌కు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

 మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డిని విమర్శించే అర్హత ఎమ్మెల్యేకు లేదు

రామవరం అభివృద్ధిపై ఎమ్మెల్యే సవాల్‌కు నేను సిద్ధం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, ఫిబ్రవరి 1: మండలంలోని రామవరం గ్రామంలో టీడీపీ, వైసీపీ హాయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి విసిరిన చాలెంజ్‌కు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రామవరంలో జరిగిన సభలో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రామకృష్ణారె డ్డి స్పందించారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇప్పటికే తాను బహిరంగ చర్చకు సవాల్‌ విసిరానని దీనికి ఎమ్మెల్యే నుంచి స్పందన లేదని అయినా రామవరం అభివృద్ధికి చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అన్ని అంశాలపైనా ఒక్క సారిగా నైనా దశల వారీగానైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి హయాంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మూలారెడ్డిని విమర్శించేస్థాయి ఎమ్మెల్యేకు లేదని ఆయన చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు ఎమ్మెల్యే సరిపోరని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా కొంకుదురు సొసైటీ విషయంలో తన మామకు రూ.26లక్షలు ఇచ్చారంటూ కార్యదర్శి లేఖ ఇచ్చారని చెప్పుకొచ్చారని దీనిపై కూడా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. గ్రాసిమ్‌ ఇండస్ట్రీకి తెలుగుదేశం హయాంలో అనుమతులు ఇచ్చారని మీరు చెబుతున్న దానికి తాము అంగీకరిస్తున్నానని అయితే అనుమతులు ఇచ్చిన వెంటనే అప్పటి సీఎం చంద్ర బాబును కలిసి పనులు నిలుపుదల చేయించానని అన్నారు. వైసీసీ అధికారంలోకి వచ్చిన తరువాత పనులను ఎందుకు నిలుపుదల చేయించలేక పోయారని అమరావతి రాజధాని పనులను నిలుపుదలచేసిన జగన్‌రెడ్డి గ్రాసిం పనులు ఎందుకు నిలుపుదల చేయలేదని ప్రశ్నించారు. నాడు ఇదే పరిశ్రమను బంగాళాఖాతంలో కలుపుతానని ప్రకటించిన జగన్‌రెడ్డి తన స్వహస్తాలతో పరిశ్రమను ఎలా ప్రారంభించారో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, మామిడిశెట్టి శ్రీను, ఒంటిమి సూర్యప్రకాష్‌, సత్యారెడ్డి, మేడపాటి అన్నవరం తదితరులు పాల్గొన్నారు.

.

Updated Date - 2023-02-02T01:39:33+05:30 IST