ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నే ప్రకటించబోతున్నారు : తోట
ABN , Publish Date - Dec 16 , 2023 | 12:30 AM
గండేపల్లి, డిసెంబరు 15: జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ తననే ప్రకటించబోతున్నారని మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు. మండలంలోని నీలాద్రిపేట గ్రామ శివారు బాలాజీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా తోట నరసింహం, తనయుడు రాంజీ
గండేపల్లి, డిసెంబరు 15: జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ తననే ప్రకటించబోతున్నారని మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు. మండలంలోని నీలాద్రిపేట గ్రామ శివారు బాలాజీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా తోట నరసింహం, తనయుడు రాంజీ హాజరయ్యారు. నరసింహం మాట్లాడుతూ నియోజకవర్గంతో తమకు ఉన్న అనుబంధం మరువలేనిదని, ప్రజలు ఎంతో ఆదరించి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లారన్నారు. నియోజకవర్గంలో గడపగడప తెలుసని ప్రతి గ్రామం కూడా ఎంతో అభి వృద్ధి చేశారన్నారు. మళ్లీ జగన్ సీఎం అయిన వెంటనే తాళ్ళూరు లిఫ్ట్‌ను మెరుగుపరిచిపూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చేస్తానన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గల్లా ఏడుకొండలు, అత్తులూరి సాయిబాబు, పరిమి వెంకటేశ్వరరావు, రామకుర్తి మూర్తి, ఒబిన్ సత్యనారాయణ, దాసరి చిన్నబాబు, సుంకర వీరబాబు, గోకవరం ఎంపీపీ రమణ, కె.రామకృష్ణ, తుల్లా రాము, తోట అయ్యన్న ఉన్నారు.