పర్యావరణ పరిరక్షణలో బాధ్యులు కావాలి

ABN , First Publish Date - 2023-06-03T01:33:18+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకుని మిషన్‌లైఫ్‌, మేరీలైఫ్‌, మేరా సత్య షెహార్‌లో భాగంగా మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠ శాల విద్యార్థులు, యువత చేపట్టిన సైకిల్‌ ర్యాలీని మన్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు ప్రారంభించారు.

పర్యావరణ పరిరక్షణలో బాధ్యులు కావాలి

అమలాపురం టౌన్‌, జూన్‌ 2: ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకుని మిషన్‌లైఫ్‌, మేరీలైఫ్‌, మేరా సత్య షెహార్‌లో భాగంగా మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠ శాల విద్యార్థులు, యువత చేపట్టిన సైకిల్‌ ర్యాలీని మన్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు ప్రారంభించారు. విద్యా ర్థులు, యువత పర్యావరణ హితానికై ప్లకార్డులు చేతబూని నినాదాలుచేస్తూ ర్యాలీ కొనసాగించారు. పర్యావరణహిత జీవనశైలికి కట్టుబడి ఉంటామని, శానిటేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శి బండి వీరన్న ప్రతిజ్ఞ చేయించారు. సింగిల్‌ యూ త్‌ ప్లాస్టిక్‌ను నివారించాలని, ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలను తగ్గించు కోవాలని నినదించారు. కార్యక్రమంలో కె.ఈశ్వర రావు, చింతా నాగేంద్రప్రసాద్‌, పి.భారతీదేవి, వి.సతీష్‌, ఎం.భార్గవి, వైఎస్‌.భారతి, ఎం.లావణ్య, పిండి రాజా, హెచ్‌ఎం బందా ఆర్‌.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:33:18+05:30 IST