సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2023-05-26T01:18:29+05:30 IST

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా, తాలూకా స్థాయిలో ఆందోళనలు చేస్త్నుప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌రాజు అన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 25 : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా, తాలూకా స్థాయిలో ఆందోళనలు చేస్త్నుప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌రాజు అన్నారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురువారం నిరసన దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగులు వినూత్నంగా ఉద్యోగుల ఐక్యత అని ముద్రించిన కండువాలను, టోపీలను ధరించి వివిధ స్లోగన్లతో ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం, ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐకు రక్షణ కల్పించడం, పెన్షనర్లకు రావాల్సిన పదవీ విరమణ బెనిఫిట్స్‌ తదితరాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యమం అక్టోబరు 31 వరకూ వివిధ దశల్లో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే నవంబరు 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి భరత్‌రాజు, తాలూకా యూనిట్‌ అధ్యక్షురాలు ఎం.నాగమణి, కార్యదర్శి శ్రీనివాసరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రాజకుమారి, రామచంద్రరావు, శాంతిప్రియ, సురేంద్ర, సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:18:29+05:30 IST