Share News

కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:47 AM

కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

ముమ్మిడివరం, డిసెంబరు 22: సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. పీటీఎఫ్‌, ఈఎస్‌ఐలను అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. పీసీసీ సభ్యుడు పెన్మెత్స జగ్గప్పరాజపు, ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ, ఎస్సీవిభాగ అధ్య క్షుడు వడ్డి నాగేశ్వరరావు, గోడి భాస్కరరావు, కుప్పల రవి, దాట్ల బాబు పాల్గొని సంఘీభావం తెలిపారు. దర్నాలో సీఆర్పీ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీను బాబు, జిల్లా కార్య దర్శి ఎన్‌.వెంకట్‌, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.వెంకటే శ్వరరావు, ఐఈఆర్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రిసోర్సు పర్సన్స్‌ జిల్లా అధ్యక్షుడు నాగన్న, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు ఎం.శ్రీని వాసరావు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, దాట్ల బాబు, పీఆర్‌టీయూ కోనసీమ జిల్లా కార్యదర్శి దీపాటి సురేష్‌బాబులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

Updated Date - Dec 23 , 2023 | 12:47 AM