ఎన్నికల్లో మాలలకు టిక్కెట్‌ కేటాయించాలి

ABN , First Publish Date - 2023-09-20T00:38:32+05:30 IST

రాబోయే శాసనసభ ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నియోజవర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టిక్కెటు కేటాయించాలని పలువురు వ్యక్తలు డియాండ్‌ చేశారు. సోమవారం కొవ్వూరులోని పరిమి రామారాయుడు, రత్తమ్మ కళ్యాణ మండపంలో యునైటెడ్‌ స్ట్రెంత్‌ (మాల సామాజిక వర్గ నాయకుల) కన్వీనర్‌ బొంతా శ్యాం రవిప్రకాష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఎన్నికల్లో మాలలకు టిక్కెట్‌ కేటాయించాలి
సమావేశంలో పాల్గొన్న మాల సామాజికవర్గ నాయకులు

కొవ్వూరు, సెప్టెంబరు 19: రాబోయే శాసనసభ ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నియోజవర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టిక్కెటు కేటాయించాలని పలువురు వ్యక్తలు డియాండ్‌ చేశారు. సోమవారం కొవ్వూరులోని పరిమి రామారాయుడు, రత్తమ్మ కళ్యాణ మండపంలో యునైటెడ్‌ స్ట్రెంత్‌ (మాల సామాజిక వర్గ నాయకుల) కన్వీనర్‌ బొంతా శ్యాం రవిప్రకాష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయినప్పటికీ రెండున్నరేళ్లుగా కుల వివక్షకులోనై తనలో తానే మదనపడుతున్నానన్నారు. కొవ్వూరు మండల జడ్పీటీసీ సభ్యురాలు బొంతా వెంకటలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలన్నారు. బొంతా శ్యాం మాట్లాడుతూ మాలల ఆత్మగౌరవం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 2024లో మాలలకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, జాతీయ ఎన్నికల కమీషన్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని బిరుడుగడ్డ ప్రవీణ్‌ తెలిపారు. ఈ అంశంపై పల్లి లక్ష్మణ్‌ సుధారాణి, మోసుగంటి నరేంద్ర, జక్కల శ్రీను, మరపట్ల కళాధర్‌, నతా పరమ రాజేశ్వరరావు, కప్పల రాజేష్‌, చిన్నం హరిబాబు ప్రసంగించారు. కార్యక్రమంలో బావన రాజేష్‌, గారపాటి రవికిషోర్‌, పల్లికొండ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:38:32+05:30 IST