మార్చి 21 వరకు ఎన్నికల కోడ్
ABN , First Publish Date - 2023-02-10T00:51:19+05:30 IST
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి శాసనమండలికి ఎంపికైన చిక్కాల రామచంద్రరావు పదవీకాలం ఈ ఏడాది మే1వ తేదీ నాటికి ముగు స్తుండటంతో భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అమలాపురం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి)/కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి శాసనమండలికి ఎంపికైన చిక్కాల రామచంద్రరావు పదవీకాలం ఈ ఏడాది మే1వ తేదీ నాటికి ముగు స్తుండటంతో భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున ఈనెల 9నుంచి మార్చి 21వ తేదీవరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వపరంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని కలెక్టర్ సూచించారు. ఈనెల 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుందని, 23వ తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 13న ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మార్చి 16వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ మార్చి 21తో ముగుస్తుందని కలెక్టర్ తెలిపారు.