ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-06-03T01:15:05+05:30 IST

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొ నేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలను అందుకు సిద్ధం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపుని చ్చారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
సమన్వయ కమిటీ సమావేశంలో సభ్యులతో చర్చిస్తున్న రామకృష్ణారెడ్డి

  • మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించాలి

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, జూన్‌ 2: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొ నేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలను అందుకు సిద్ధం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపుని చ్చారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నియోజకర్గంలో పార్టీ పరిస్థితులు, పటిష్టతకు చేపట్టాల్సిన అంశాలను సభ్యుల తో చర్చించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానా డులో పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించా లని సూచించారు. ప్రతి గ్రామంలోను కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. మినీ మేనిఫెస్టో జనరంజకంగా ఉందని చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు ఆయన హామీలను విశ్వసిస్తున్నారన్నారు. మహిళలు, యువత, నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు పాలన కోసం ఎదు రు చూస్తున్నారన్నారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఆళ్ల గోవిందు, వెలుగుబంటి సత్తి బాబు, సత్తి దేవదానరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, పడాల ఆదినారాయణరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:15:05+05:30 IST