జిల్లాలో 971.44 ఎకరాల్లో ఆక్వాజోన్‌

ABN , First Publish Date - 2023-02-07T01:17:59+05:30 IST

జిల్లాలో 971.44 ఎకరాల పరిధిలో ఆక్వా జోన్‌ గుర్తించినట్టు జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జిల్లా ఆక్వాజోన్‌ కమిటీ సభ్యులు కలెక్టర్‌ మాధవీలత అధ్యక్షత సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆ

జిల్లాలో 971.44 ఎకరాల్లో ఆక్వాజోన్‌

కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 971.44 ఎకరాల పరిధిలో ఆక్వా జోన్‌ గుర్తించినట్టు జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జిల్లా ఆక్వాజోన్‌ కమిటీ సభ్యులు కలెక్టర్‌ మాధవీలత అధ్యక్షత సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా సాగు పెంచాలన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో 493 మంది రైతులు 2,120 ఎకరాల్లో ఆక్వా కోసం నమోదు చేసుకున్నారని, వారిలో 112 మందికి చెందిన 346 ఎకరాలు ఆక్వాజోన్‌లో ఉన్నట్టు చెప్పారు. జిల్లా సూక్ష్మ ఇరిగేషన్‌ అధికారి వై.శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:18:02+05:30 IST