స్పందనలో అర్జీలు 173

ABN , First Publish Date - 2023-09-26T01:19:57+05:30 IST

బొమ్మూరు, సెప్టెంబర్‌ 25: స్పందనలో వచ్చే ప్రతీ అర్జీ రీ ఓపెన్‌ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. సోమవారం జిల్లాస్థాయి స్పందనలో కలెక్టర్‌, జేసీ తేజ్‌భరత్‌ 173 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్ర

స్పందనలో అర్జీలు 173
స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

ప్రతి అర్జీ రీ ఓపెన్‌ అవ్వకూడదు : కలెక్టర్‌ మాధవీలత

బొమ్మూరు, సెప్టెంబర్‌ 25: స్పందనలో వచ్చే ప్రతీ అర్జీ రీ ఓపెన్‌ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. సోమవారం జిల్లాస్థాయి స్పందనలో కలెక్టర్‌, జేసీ తేజ్‌భరత్‌ 173 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలని తెలిపారు. అర్జీదారునికి సమస్య పూర్తయ్యే వరకూ సం బంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జేకేసీలో హౌసింగ్‌, మెడికల్‌, డీఆర్డీఏ వంటి శాఖలకు చెందిన అర్జీలు ఎక్కువగా వస్తు న్నాయన్నారు. అధికారులు వాటిపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

రేపు రూరల్‌ సమస్యలపై అర్జీల స్వీకరణ

స్థానిక కలెక్టరేట్‌లో రాజమహేంద్రవరం రూరల్‌కు చెందిన ప్రజల నుంచి జగనన్నకు చెబుదాం అర్జీలు బుధవారం స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మండల స్థాయిలో జేకేసీ నిర్వహిస్తున్నారని తెలిపారు. కేవలం రూరల్‌ పరిధిలో సమస్యల అర్జీలు స్వీకరిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. జేకేసీ పోర్టల్‌ ద్వారా వివరాలు నమోదు చేసి రశీదు ఇస్తామని ఆమె తెలిపారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

బాల్య వివాహాలు అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్‌ మాధవీలత

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు అరికట్టడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని కలెక్టర్‌ మాధవీలత పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 18004254156 వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. శ్రీమ తి కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడు తూ బాల్య వివాహాల కట్టడికి జిల్లా స్థాయిలో ఫిర్యాదులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. చైల్డ్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరు 1098కి ఫిర్యాదు చేసి బాధితులు సహాయం పొందవచ్చన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాల విషయం తమ దృష్టికి వస్తే వెంటనే అధికా రులకు తెలియజేయడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. బాల్య వివాహాల నివారణకు మండల స్థాయిలో పిల్లల సంరక్షణ కమిటీలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రిన్సి పాల్‌ పి.రాఘవాకుమారి, జిల్లా స్త్రీ శిశు సంరక్ష ణాధికారిణి కె.విజయకుమారి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:19:57+05:30 IST