స్పందనకు 123 అర్జీలు
ABN , First Publish Date - 2023-08-22T01:18:56+05:30 IST
బొమ్మూరు (రాజమహేంద్రవరం) ఆగస్టు 21: బొమ్మూరులోని కలెక్టరేట్ జిల్లాస్థాయి స్పందనలో కలెక్టర్ మాధవీలత, అదనపు ఎస్పీ రజనీ, జేసీ తేజ్‌భరత్, డీఆర్వో నరసింహులు 123 అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్షలో భాగంగా 99 శాతం పైగా అర్జీలు పరిష్కారం చేశామన్నారు. ప్రతీ అర్జీ పరిష్కారం చేయడంతోపాటు ఆడిట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో సుమారు 2 వేల అర్జీలకు చెందిన సోషల్ ఆడిట్ ఆన్లైన్‌లో అప్లో
మూడో సోమవారం అధికారులు విధిగా హాజరవ్వాలి
కలెక్టర్ మాధవీలత ఆదేశం
బొమ్మూరు (రాజమహేంద్రవరం) ఆగస్టు 21: బొమ్మూరులోని కలెక్టరేట్ జిల్లాస్థాయి స్పందనలో కలెక్టర్ మాధవీలత, అదనపు ఎస్పీ రజనీ, జేసీ తేజ్‌భరత్, డీఆర్వో నరసింహులు 123 అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్షలో భాగంగా 99 శాతం పైగా అర్జీలు పరిష్కారం చేశామన్నారు. ప్రతీ అర్జీ పరిష్కారం చేయడంతోపాటు ఆడిట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో సుమారు 2 వేల అర్జీలకు చెందిన సోషల్ ఆడిట్ ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. జేసీ తేజ్‌భరత్ మాట్లాడుతూ రీఓపెన్ అర్జీల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. రీ ఓపెన్‌లో ఎక్కువగా రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖకు చెందినవి వస్తున్నాయని, సమస్య వెనువెంటనే పరిష్కరించేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా పెరవలి మండలం అన్నదేవరపేటలో ఎస్సీలకు చెందిన బహిర్భూమిని వైసీపీ మద్దతుదారులు అన్యాక్రాంతం చేస్తున్నారని న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరుతూ వి.దొరబాబు, కె.శ్రీను అర్జీ ఇచ్చారు. స్పందనలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైసీపీ నాయకుల వల్ల దళితులకు అన్యాయం..
అన్నవరపాడు ఇళ్ల స్థలాల కేటాయింపులో వైసీపీ నాయకులు దళితులపట్ల కులవివక్ష చూపారని సీపీఎం జిల్లా నాయకుడు జువ్వల రాంబాబు ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద రాంబాబు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కంచే చేను మేస్తోందన్నారు. గ్రామంలో ఓసీ, బీసీకు జాతీయ రహదారి పక్కన స్థలాలు ఇచ్చారని, దళితులకు స్మశాన వాటిక దగ్గర ఇచ్చి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. గ్రామకంఠం భూమి ఓసీ, బీసీలకు కమ్యూనిటి హాల్‌కు కేటాయించారు. దళితవాడకు దగ్గరో ఉన్న ఎకరన్నర భూమిని కమ్యూనిటీహాల్‌కు కేటాయించకుండా రెవెన్యూ అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మకై లేఅవుట్‌లు వేసి 70 వేలు, 80 వేలు తీసుకుని పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. కొన్ని భూములకు పట్టాలు ఇచ్చి దారి లేకుండా పట్టాలు మంజూరు చేశారన్నారు. వీటిపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ తేజ్‌భరత్‌ను కలిసి సమస్య వివరించారు. ఆర్డీవోను విచారణ చేయమని జేసీ ఆదేశించారు. ఈనిరసన కార్యక్రమంలో శ్రీను, దొరబాబు, మేరీ, సువార్త, బేబి పాల్గొన్నారు.