ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ జగదీశ్
ABN , First Publish Date - 2023-09-26T01:20:51+05:30 IST
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ జగదీశ్ స్పష్టంచేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 32 అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. ఫిర్యాదు దారులతో స్వయంగా మా

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ జగదీశ్ స్పష్టంచేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 32 అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడారు. చట్ట ప్రకారం వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా నిమ జ్జనాలు చేసే సమయంలో పోలీస్‌ల సూచనలు, నిబంధనలు పాటించాలన్నారు.