లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ సందర్శించిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి

ABN , First Publish Date - 2023-09-26T01:17:36+05:30 IST

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రత్యూష కుమారి సోమవారం రాజమహేంద్రవరం రూరల్‌ పిడింగొయ్యిలోని జీఎస్‌కేఎం లా కళాశాలలోని లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ని సందర్శించారు. క్లినిక్‌ కార్యనిర్వా హక బృం

లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ సందర్శించిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రత్యూష కుమారి సోమవారం రాజమహేంద్రవరం రూరల్‌ పిడింగొయ్యిలోని జీఎస్‌కేఎం లా కళాశాలలోని లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ని సందర్శించారు. క్లినిక్‌ కార్యనిర్వా హక బృందంతో ఆమె మాట్లాడి అనంతరం ఏడీఆర్‌, మీడియేషన్‌ ప్రక్రియ ద్వారా న్యాయ సమస్యల పరిష్కారంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యూషకుమారి మాట్లాడుతూ ఏడీఆర్‌, మీడియేషన్‌ ప్రక్రియ ద్వారా రాజీకి యోగ్యమైన అన్ని వివాదాలు స్నేహపూరిత వాతావరణంలో శిక్షణ పొందిన న్యాయవాదుల సహాయంతో రాజీ మార్గంలో పరిష్కరించబడతాయని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T01:17:36+05:30 IST