ఉద్యోగుల జీవితాలతో జగన్‌ ప్రభుత్వం ఆటలు

ABN , First Publish Date - 2023-09-26T01:23:57+05:30 IST

బొమ్మూరు, సెప్టెంబరు 25: ఉద్యోగుల జీవితాలతో జగన్‌ ప్రభ్వుత్వం ఆటలాడుతోందని జిల్లా ఎఫ్‌ఏపీటీవో చైర్మన్‌ పి.జయకర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఎఫ్‌ఏపీటీవో, ఏపీసీపీఎస్‌ఈఏ సంయుక్త ఆధ్వర్యంలో పాత పింఛను విధానం అమలు కోరుతూ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఉద్యో గుల సమస్యలపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దొడ్డిదారిన ఆర్డినెన్స్‌ ద్వారా తీసుకున్న జీపీఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం ఏపీ ఎస్‌ను ఒప్పుకోవడం లేదని ప్రభుత్వ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉం

ఉద్యోగుల జీవితాలతో జగన్‌ ప్రభుత్వం ఆటలు

కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల ధర్నాలో ఎఫ్‌ఏపీటీవో చైర్మన్‌ పి జయకర్‌

బొమ్మూరు, సెప్టెంబరు 25: ఉద్యోగుల జీవితాలతో జగన్‌ ప్రభ్వుత్వం ఆటలాడుతోందని జిల్లా ఎఫ్‌ఏపీటీవో చైర్మన్‌ పి.జయకర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఎఫ్‌ఏపీటీవో, ఏపీసీపీఎస్‌ఈఏ సంయుక్త ఆధ్వర్యంలో పాత పింఛను విధానం అమలు కోరుతూ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఉద్యో గుల సమస్యలపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దొడ్డిదారిన ఆర్డినెన్స్‌ ద్వారా తీసుకున్న జీపీఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం ఏపీ ఎస్‌ను ఒప్పుకోవడం లేదని ప్రభుత్వ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రఽధాన కార్యదర్శి శేషబ్రహ్మం మాట్లాడుతూ సీఎం ఉద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలని డిమాండు చేశారు. రాష్ట్ర ఎఫ్‌ఏపీటీవో చైర్మన్‌ నరహరి మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్న పాత పింఛను విధానాన్నే కొనసాగించాలని డిమాం డు చేశారు. ఉద్యోగులు ముక్తకంఠంతో జీపీఎస్‌ రద్దు చేస్తావా.. సీఎం గద్దె దిగుతావా అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో కోశాధికారి లక్ష్మణరావు, ఏపీసీపీఈఎస్‌ఏ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్య పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:23:57+05:30 IST