Share News

జిల్లాలో ఈ ఏడాది 308 అట్రాసిటీ కేసులు నమోదు : హిమాన్షుశుక్లా

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:33 AM

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఎటువంటి దాడులు జరగకుండా ప్రజలు సామరస్యంగా జీవించేలా చట్టంపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సం బంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఈ ఏడాది 308 అట్రాసిటీ కేసులు నమోదు : హిమాన్షుశుక్లా
కేసుల వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ ఎస్పీ బాషా, జిల్లా కలెక్టర్‌

అమలాపురం టౌన్‌, డిసెంబరు 30: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఎటువంటి దాడులు జరగకుండా ప్రజలు సామరస్యంగా జీవించేలా చట్టంపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సం బంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మం దిరంలో శనివారం కలెక్టర్‌ అధ్యక్షతన పౌరహక్కుల రక్షణ, ఎస్సీ, ఎస్టీ లపై దురాగతాల నివారణా చట్టం అమలు, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. అట్రాసిటీ కేసులను త్వరి తగతిన పరిష్కరించేందుకు న్యాయ, పోలీస్‌, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగినప్పు డు వెంటనే స్పందించి ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి చార్జిషీటు దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వరం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డివి జన్ల వారీగా అట్రాసిటీ కేసుల పరిష్కార పురోగతిని కలెక్టర్‌ సమీక్షిం చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 308 అట్రాసి టీ కేసులు నమోదైనట్టు అడ్మిన్‌ ఎస్పీ ఖాదర్‌బాషా తెలిపారు. ఎఫ్‌ఐ ఆర్‌ దశలో 64 కేసులకుగాను రూ.28.25 లక్షలు, చార్జిషీటు దశలో 62కేసులకుగాను రూ.65.12 లక్షలు, పోస్టుమార్టం మెడికల్‌ ఎగ్జామి నేషన్‌ దశలో నాలుగు కేసులకు రూ.14.37 లక్షలు చొప్పున 130 కేసు లకుగాను రూ.1.07 కోట్లు నష్టపరిహారం మంజూరు చేశారన్నారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీవోలు ఎం.ముక్కంటి. ఎస్‌.సుధాకర్‌, సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారిణి పి.జ్యోతిలక్ష్మీ దేవి, డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి..

జిల్లాలో కొబ్బరి, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ఔత్సా హిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాల ని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్ర మలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ పదో సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఏకగవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పా టుకు అవసరమైన అన్ని రకాల అనుమతులు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఏడీ శివరామప్రసాద్‌, ఎల్డీఎం కె.శ్యామ్‌బాబు, ఏపీఐఐసీ ఎస్టేట్‌ మేనేజర్‌ జ్యోతి, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:33 AM