ప్రసవ వేదన

ABN , First Publish Date - 2023-06-09T00:59:03+05:30 IST

మనుషుల్లో ప్రసవ వేదనను మరో జన్మగా భావిస్తారు. ప్రసవ వేదన ఎవరికైనా ఒకటే.. ప్రసవించేందుకు మహిళలు చాలా వేదన చెందుతారు. ప్రసవం కొందరికి సులభంగా జరగగా మరికొందరి చాలా ఇబ్బంది పడతారు. బాగా క్లిష్టమైతే ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టరు ద్వారా ప్రసవం చేయిస్తారు. అప్పుడప్పుడు బిడ్డ అడ్డం తిరిగిందనే మాట కూడా వింటుంటాం. ప్రసవ వేదన మనుషుల్లోనే కాదు పశువుల్లోను అలాగే ఉంటుందని చాగల్లులో జరిగిన సంఘటన తెలియజేసింది.

ప్రసవ వేదన
చాగల్లులో గేదెకు వైద్యం నిర్వహించి ప్రసవం చేసిన వెటర్నరీ డాక్టర్లు

  • గేదె గర్భంలో అడ్డం తిరిగిన దూడ

  • 3గంటలు శ్రమించి సుఖ ప్రసవం చేసిన వైద్యులు

  • వైద్యుల సేవలకు పలువురి అభినందన.. చాగల్లులో ఘటన

చాగల్లు, జూన్‌ 8: మనుషుల్లో ప్రసవ వేదనను మరో జన్మగా భావిస్తారు. ప్రసవ వేదన ఎవరికైనా ఒకటే.. ప్రసవించేందుకు మహిళలు చాలా వేదన చెందుతారు. ప్రసవం కొందరికి సులభంగా జరగగా మరికొందరి చాలా ఇబ్బంది పడతారు. బాగా క్లిష్టమైతే ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టరు ద్వారా ప్రసవం చేయిస్తారు. అప్పుడప్పుడు బిడ్డ అడ్డం తిరిగిందనే మాట కూడా వింటుంటాం. ప్రసవ వేదన మనుషుల్లోనే కాదు పశువుల్లోను అలాగే ఉంటుందని చాగల్లులో జరిగిన సంఘటన తెలియజేసింది. గర్భంలో దూడ అడ్డం తిరగడంతో వైద్యులు మూడు గంటలపాటు వైద్యం అందించి గేదెకు సుఖ ప్రసవం జరిగేలా చేసి విజయం సాధించారు. చాగల్లుకు చెందిన పాడి రైతు దొంగ వెంకటరావుకు చెందిన గేదె చూలి కట్టింది. నెలలు నిండడంతో గురువారం ప్రసవ వేదనకు గురైంది. ప్రసవం జరుగుతుందని ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేచి చూశారు. ఎంత ప్రయత్నించినా ప్రసవం కాకపోవడంతో పశువైద్యులను సంప్రదించారు. పశువైద్యాధికారి యు.ముఖేష్‌ అక్కడికి చేరుకుని గేదెను పరీక్షించి గర్భంలో దూడ అడ్డం తిరిగినట్టు గుర్తించారు. ఆయనతోపాటు పశుఆరోగ్య సేవా వాహనం డాక్టర్‌ ఎస్‌.విజయలక్ష్మి సహాయకులు కె.లక్ష్మి, కరిష్మాల బృదం తీవ్రమైన ఎండ సమయంలో సుమారు 3 గంటల పాటు శ్రమించి మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆపరేషన్‌ అవసరం లేకుండానే సుఖ ప్రసవం జరిగేలా చేసి గేదెను, దూడను కాపాడారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను పాడి రైతులు సహా పలువురు అభినందించారు.

Updated Date - 2023-06-09T00:59:03+05:30 IST