ప్రమాదాలకు కేరాఫ్‌ సాగర సంగమం

ABN , First Publish Date - 2023-06-07T00:58:30+05:30 IST

సాగర సంగమ తీరాన భద్రతా లోపాలు కనిపిస్తున్నాయని పర్యాటకులు, భక్తులు, స్థానికులు వాపోతున్నారు.

ప్రమాదాలకు కేరాఫ్‌ సాగర సంగమం

అంతర్వేది, జూన్‌ 6: సాగర సంగమ తీరాన భద్రతా లోపాలు కనిపిస్తున్నాయని పర్యాటకులు, భక్తులు, స్థానికులు వాపోతున్నారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి సుమారు 20కు పైగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సముద్ర కెరటాల తాకిడికి ఎంతో మంది బలైపోతున్నారు. ప్రమాద సంఘటనా స్థలంగా అంతర్వేది సాగర సంగమం, అన్నాచెల్లెలు గట్టు ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో అధికారుల లోపం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని భక్తులు, పర్యాటకులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ, పోలీసు, మెరైన్‌ పోలీ సులు ప్రమాద సంఘటన స్థలాల్లో ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సముద్రకెరటాలకు పర్యా టకులు బలవు తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు వంటి సంఘట నలు జరగకుండా సముద్ర నదీ పరివాహక ప్రాంతం, అన్నా చెల్లెలు గట్టు వద్ద, బీచ్‌ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు, పర్యాటకులు, భక్తులు అధికారులను కోరుతున్నారు. అన్నా చెల్లెలు సాగర సంగమం వద్ద పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారని భావించి స్థానిక మెరైన్‌, పోలీసు, పంచా యతీ అధికారులు అటుగా వెళ్లే మార్గాలను మూసివేశారు.

Updated Date - 2023-06-07T00:58:30+05:30 IST