Share News

తుఫాన్‌.. రెడ్‌ అలర్ట్‌!

ABN , First Publish Date - 2023-12-03T01:31:28+05:30 IST

కోస్తాంరఽధపై మిచౌంగ్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

తుఫాన్‌.. రెడ్‌ అలర్ట్‌!

జిల్లాలో మిచౌంగ్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం

అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలి

కళ్లాల్లో ధాన్యాన్ని మిల్లులకు తరలించే ఏర్పాట్లు

కోస్తా తీరంలో 37 పునరావాస కేంద్రాలు : కలెక్టర్‌

అమలాపురం టౌన్‌, డిసెంబరు 2: కోస్తాంరఽధపై మిచౌంగ్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆగ్నే య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారుతుందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం కావాలని కోస్తా తీరం వెంబడి ఉన్న 12 జిల్లాల కలెక్టర్లకు ఆయన సూచించారు. శనివారం అమరావతి నుంచి జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సు నిర్వహిం చి పలు సూచనలు చేశారు. చెన్నై-మచిలీపట్నం మధ్య తుఫా న్‌ తీరం దాటే అవకాశం ఉందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలకు తావు లేకుండా అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్డీఆర్‌ ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశామన్నారు. ఈనెల 6వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్య కారులెవరూ చేపల వేటకు వెళ్లరాదని స్పష్టంచేశారు. సము ద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే వెనక్కు రప్పిం చాలన్నారు. వరికోతలను వాయిదా వేసుకోవాలని రైతాంగానికి సూచించారు. వీడియో కాన్ఫరెన్సు అనంతరం కలెక్టర్‌ హిమా న్షుశుక్లా జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో తీరం వెంబడి 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నా రు. పల్లపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యశాఖ ద్వారా పడవ లు ఏర్పాటుచేసి గజఈతగాళ్లను నియమించాలన్నారు. గతా నుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో అధికా రులు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ నిరంతరాయంగా ఉండేలా జనరేటర్లను డీజిల్‌ ఇంధనంతో సిద్ధంచేయాలన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో మండల స్థాయి స్టాక్‌ పాయింట్లు వద్ద నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో ఇంకా 60వేల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉందని, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే రైసు మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌అజయ్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీవో జి.కేశవర్థనరెడ్డి, జిల్లా వ్యవసాయా ధికారి ఎ.బోసుబాబు, ట్రాన్స్‌కో కార్యనిర్వాహక ఇంజనీర్‌ రవి కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం రాశులు పరిశీలించిన ఆర్డీవో

అమలాపురం రూరల్‌, డిసెంబరు 2: తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో శనివారం రాత్రి ఆర్డీవో జి.కేశవర్థనరెడ్డి రెడ్డిపల్లిలో పర్యటించి ధాన్యం రాశులను పరిశీలించారు. తుఫాన్‌ కార ణంగా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. రైతులు పడుతున్న పలు ఇబ్బందులను సర్పంచ్‌ కరాటం రత్నప్రసన్న ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. మిల్లర్ల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ధాన్యం రాశులను పరిశీలించిన అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. తహశీల్దార్‌ పరమట శ్రీపల్లవి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎంఏ షంషీ, మండల వ్యవసాయాధి కారి కడలి ధర్మప్రసాద్‌, వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్‌ కరాటం సూర్యభాస్కరరావు, దొరబాబు, కరాటం ప్రవీణ్‌ పాల్గొన్నారు.

యానాంలో రేపు పాఠశాలలకు సెలవు

యానాం, డిసెంబరు 2: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం మిచౌంగ్‌ తుఫాన్‌గా మారిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పాలనాయంత్రాంగం సమీక్షా సమావే శం నిర్వహించారు. పరిపాలనాధికారి మునిస్వామి నేతృత్వం లో జరిగిన ఈ సమావేశంలో యానాం పరిఽధిలో తీసుకోవాలసిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఒకటి రెం డ్రోజుల్లో కోస్తాంధ్రతోపాటు యానాంపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అం చనా వేసినట్టు మునిస్వామి తెలిపారు. తుఫాన్‌ పరిణామాలను ఎదుర్కోనడానికి యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు. యానాంలో వేగంగా ఈదురుగాలులు వీస్తున్నందున సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు. ముఖ్య మైన సమాచారానికి కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబరు 0884- 2325105, 2321223కు సంప్రదించాలన్నారు. కాగా 20 మంది సభ్యుల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం యానాం చేరుకుంది.

Updated Date - 2023-12-03T01:31:30+05:30 IST