అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారం
ABN , First Publish Date - 2023-06-11T01:18:28+05:30 IST
సీఎం జగన్మోహన్‌రెడ్డి చర్య లతో విద్యుత్ రంగం కుదేలైందని, అప్రకటిత విద్యుత్ కోత లతో రాష్ట్రాన్ని అంథకారంలోకి నెట్టేశారని టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు విమర్శించారు.
అమలాపురం టౌన్, జూన్ 10: సీఎం జగన్మోహన్‌రెడ్డి చర్య లతో విద్యుత్ రంగం కుదేలైందని, అప్రకటిత విద్యుత్ కోత లతో రాష్ట్రాన్ని అంథకారంలోకి నెట్టేశారని టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు విమర్శించారు. పట్ట ణంలోని తన స్వగృహంలో టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలపై భారం మోపుతూ నాలుగేళ్లలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. అవినాశ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ప్రజల సొమ్ము దోచేస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్లు పెద్ద స్కామ్ అని, రూ.10వేలు ఖరీదు లేని ఈమీటర్లను రూ.31వేలకు కొనుగోలు చేయడం దారుణమ న్నారు. సైకో ప్రభుత్వాన్ని సాగనంపకపోతే రాష్ట్రం అథోగతి పాలవుతుందన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి అల్లాడ స్వామినా యుడు మాట్లాడుతూ ఆక్వా రైతులను నట్టేట ముంచేశార న్నారు. సమావేశంలో నల్లా స్వామి, పెచ్చెట్టి విజయలక్ష్మి, కర్రి దత్తుడు, మాకినీడి పూర్ణిమ, బొర్రా చిట్టిబాబు, పచ్చిగోళ్ల నర్సిబాబు, పెద్దిరెడ్డి నాయుడు, చింతలపూడి సత్తిబాబు, ఆశెట్టి ఆదిబాబు, వలవల శివరావు, భాస్కర్ల రామకృష్ణ, జయంతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.