పంట రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-08-02T01:35:21+05:30 IST

జిల్లాలో సొంత భూమి కలిగిన రైతులతోపాటు కౌలు రైతు లకు పంట రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.

పంట రుణాల మంజూరు ప్రక్రియ  వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర అధికారులు

జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశం

కాకినాడ సిటీ, ఆగస్టు1: జిల్లాలో సొంత భూమి కలిగిన రైతులతోపాటు కౌలు రైతు లకు పంట రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా.. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలాక్కియా, ఇతర జిల్లా స్థాయి అఽధికారులతో కలిసి సీసీఆర్సీ కార్డులు పంపిణీ, పంట రుణాలు మంజూరు, ఓటర్ల జాబితా తనిఖీ, గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ సర్వే, వాలంటీర్ల ఎడ్యుకేషన్‌ సర్వే, జేవీకే కిట్లు పంపిణీ, ప్రభుత్వ శాశ్వత భవనాల నిర్మాణాలు వంటి అంశాలకు సంబంధించిన పురోగతిని క్షేత్రస్థాయి అధికారు లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 94 శాతం సీసీఆర్సీ కార్డులు పంపిణీ పూర్తిచేయడం జరిగిం దన్నారు. ఇంకా అర్హత కలిగిన కౌలు రైతులను గుర్తించి ఈ వారంలో కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా సొంత భూమి కలిగిన రైతులతోపాటు కౌలు రైతులకు పంట రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని పంట రుణాలు మంజూరు నూరు శాతం పూర్తయ్యే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో గత నెల 21న ప్రారంభించిన ఓటర్ల జాబితా ఇంటింటి తనిఖీ ప్రణాళికాయుతంగా చేపట్టాలన్నారు. మిగిలిన అంశాలపై కలెక్టర్‌ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్‌లో డీఆర్‌వో కె శ్రీధర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ జేడీ ఎస్‌ సూర్యప్రకాశరావు, ఇన్‌చార్జి డీఈవో జి నాగమణి, పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎం శ్రీనివాసు, ఎల్డీఎం ఎం ప్రసాద్‌, కాకినాడ, పెద్దాపురం డీఎల్డీవోలు పి నారాయణమూర్తి, కేఎన్వీ ఎస్‌ ప్రసాదరాజులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొండబాబు, పాల్గొన్న నాయకులు

Updated Date - 2023-08-02T01:35:21+05:30 IST