చేతులు రావట్లే...
ABN , First Publish Date - 2023-04-12T01:18:37+05:30 IST
కొవిడ్ మృతుల కుటుంబాలపై జగన్ ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోంది. ఆర్థికంగా రూ.50వేల సాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చినా నెరవేర్చకుండా బాధితులకు చుక్కలు చూపిస్తోంది. ఏళ్ల తర బడి వారంతా నిరీక్షించేలా చేస్తోంది. అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అం టూ కాలయాపన చేస్తూ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటోంది.
-జిల్లాలో కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థికసాయమేది
-ప్రభుత్వం ప్రకటించిన పరిహారం దక్కక ఏళ్లతరబడి బాధితుల నిరీక్షణ
-జిల్లావ్యాప్తంగా 400మందికి రూ.2కోట్లకుపైగా పేరుకుపోయిన బకాయిలు
-అదిగో ఇస్తామంటూ నెలల తరబడి కుంటిసాకులు చెబుతున్న జగన్ సర్కారు
-తల్లిదండ్రుల్లో ఒకరు కోల్పోయి అనాథలైన చిన్నారుల సాయానికీ పంగనామాలే
-ఆరు నెలల నుంచి ఒక్కపైసా కూడా విదల్చకుండా చుక్కలు చూపిస్తున్న వైనం
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
కొవిడ్ మృతుల కుటుంబాలపై జగన్ ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోంది. ఆర్థికంగా రూ.50వేల సాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చినా నెరవేర్చకుండా బాధితులకు చుక్కలు చూపిస్తోంది. ఏళ్ల తర బడి వారంతా నిరీక్షించేలా చేస్తోంది. అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అం టూ కాలయాపన చేస్తూ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటోంది. సా యం అసలు వస్తుందా? రాదా? అని అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని వినిపిస్తున్న మాటలు నీరసించేలా చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సాయం అందడం గగనమే అనే నిట్టూర్పులు బాధితులనుంచి వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 400 కుటుంబాలకు ప్రభుత్వంనుంచి రూ.2కోట్లకుపైగా రావాల్సి ఉన్నా ఇంతవరకు అతీగతీ లేదు. అసలు ఇస్తామో ఇవ్వమో అనేదానిపై ప్రభు త్వం ఉలకడం లేదు. మరోపక్క కొవిడ్‌తో తల్లిదండ్రులిద్దరిలో ఒకరిని కో ల్పోయి అనాథలైన చిన్నారులకు చెల్లించాల్సిన నెలవారీ సాయం కూడా ఆరునెలల నుంచి రాష్ట్రప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో సర్కారు తీరుపై బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పుడు గొప్పలు.. ఇప్పుడు తిప్పలు..
జిల్లాలో 2019లో కొవిడ్ మహమ్మారి విశ్వరూపం చూపించింది. వేలాదిమంది వైరస్ బారిన పడి ఆస్పత్రుల పాలయ్యారు. ఆ తర్వాత 2021లో సెకండ్‌వేవ్ మరింత కకావికలం చేసేసింది. వైరస్ వ్యాపించడం తో జిల్లాలో రోజుకు వేలాదిమంది పాజిటివ్‌కు గురయ్యారు. ఊపిరి ఆడ క, ఆస్పత్రుల్లో పడకలు దొరక్క అల్లాడిపోయారు. రకరకాల లక్షణాలతో నరకయాతన పడ్డారు. ప్రతిరోజూ కొవిడ్‌తో వందలాదిమంది చనిపోయారు. కాకినాడ జీజీహెచ్‌నుంచి ప్రైవేటు ఆస్పత్రుల వరకు చికిత్స కోసం వెళ్లి పరిస్థితి విషమించి క్షణాల్లో మృత్యువాత పడ్డవారి సంఖ్య వేలల్లో ఉండేది. ఆస్పత్రుల్లో చనిపోయిన వారితో శ్మశానాల్లో చేతులు రేయింబ వళ్లు కాలుతూనే ఉండేవి. సెకండ్‌వేవ్ ముగిసేనాటికి జిల్లాలో కేసులు లక్షలు దాటిపోగా కొవిడ్ మరణాలు వేలకు చేరాయి. ఈక్రమంలో జిల్లాలో వేలాది కుటుంబాలు అనాథలుగా మారాయి. ఇంట్లో తల్లిదండ్రులు కోల్పోయి కొందరు, బిడ్డలను కోల్పోయి మరికొందరు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థికసాయం అందజేస్తామ ని ప్రకటించింది. ఈ మేరకు 2021, అక్టోబరులో జగన్ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. తక్షణం ప్రకృతి వైపరీత్యాల నివారణ నిధి నుంచి ఆర్థికసాయం బాధితులకు చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. బాధితు లు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో వేలాదిమంది రూ.50వేల ఆర్థికసాయానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాల యానికి పోటెత్తారు. ప్ర భుత్వం ఊహించనన్ని దరఖాస్తులు సాయం కోసం రావడంతో అప్ప టికప్పుడు కొత్త నిబంధ నలు విధించి బాధితుల సంఖ్యలో వడపోత పోసేసింది. వచ్చిన దరఖా స్తులను కుదించేసింది. దీంతో చివరకు 4,500 మంది వరకు సాయానికి అర్హులని జిల్లా అధికారులు గుర్తించారు. వీరందరికీ రూ.50వేల సా యం చొప్పున అప్పటికప్పుడు అందించాల్సి ఉన్నా నిధుల కొరత సాకుతో ప్రభుత్వం చాలాకాలం సాయం అందించకుండా తప్పించుకుంది. ఆ త ర్వాత దఫదఫాలుగా కొందరికి డబ్బులు జమ చేసింది. కానీ ఇంకా జిల్లా లో 400కుపైగా కుటుంబాలకు రూ.50వేల సాయం అందలేదు. దాదా పు ఏడాదిన్నర దాటినా వీరికి జగన్ ప్రభుత్వం పరిహారం అందించక పోవడం విశేషం. జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రతిపాదనల మేరకు రూ.2కో ట్లకుపైగా నిధులు ఇవ్వాలని జిల్లా రెవెన్యూశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇంతవరకు డబ్బులు రాలేదు. దీంతో పలుసార్లు జి ల్లాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల గురించి గుర్తు చేసినా ఖ జానాలో డబ్బులు లేవనే సాకుతో సాయం ఊసే మర్చిపోయారు. దీంతో బాధిత కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. మరోపక్క ఇంట్లో కుటుంబసభ్యులు ఒకరు కొవిడ్‌తో మరణించి రోడ్డున పడ్డ తమకు రూ.50వేల ఆర్థిక సాయం ఎంతోకొంత ఉపయోగపడే అవకాశం ఉన్నా ప్రభుత్వం మాట తప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇంక తమకు సాయం అందుతుందనే ఆశలు వదిలేసుకు న్నారు. ఈ బకాయిలపై తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బాకీలు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. సుప్రీంకోర్టు ఆదేశించినా జగన్ సర్కారు ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందో తెలియని పరిస్థితి.
చిన్నారుల సాయంపైనా అంతే..
కొవిడ్ సెకండ్‌వేవ్‌లో జిల్లాలో వేలాదిమంది చనిపోగా అనేక కుటుం బాలు అనాథలయ్యాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులు వందల్లో ఉన్నారు. అటువంటి చిన్నారులకు నెలకు రూ.500 సాయం అందజేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించినా ఆ తర్వాత ఈ మొత్తం నెలకు రూ.4వేలకు పెరిగింది. దీనిప్రకారం జిల్లాలో 350మంది వరకు చిన్నారులకు ఈ సాయం నెలనెలా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆరునెలలుగా అసలు ప్రభుత్వం నిధులే విడు దల చేయడం లేదు. మిషన్ వాత్సల్య కింద ఈ డబ్బులు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఏడాదినుం చి ఈ చిన్న మొత్తం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. ఇది తీవ్ర విమర్శలకు దారి తీయడంతో కొన్నినెలల కిందట ఆరునెలల పాత బాకీ నిధులు విడుదల చేసింది. ఇంకా ఆరు నెలలకు సంబంధించి లక్షల్లో బకాయిలు ఉండిపోయాయి.