కోట్లు కొట్టేద్దాం

ABN , First Publish Date - 2023-03-02T01:16:09+05:30 IST

కొవిడ్‌ బిల్లుల పేరుతో కాకినాడ కలెక్టరేట్‌లో కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమైంది. లేని ఖర్చులు చూపించి రూ.4కోట్ల వరకు పంగ నామం పెట్టేందుకు కొందరు ఉద్యోగులు స్కెచ్‌ వేశారు. దొంగ బిల్లుల తో డబ్బులు కాజేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం కలెక్టర్‌ను సైతం బురిడీ కొట్టించేందుకు పథకం పన్నారు. తీరా అనుమానం వచ్చిన కలెక్టర్‌ బిల్లులు మంజూరు కాదుకదా.. అసలు అంత ఖర్చుపై అను మానం వచ్చి విచారణకు ఆదేశించడం కలెక్టరేట్‌లో కలకలం రేపుతోం ది.

కోట్లు కొట్టేద్దాం

కాకినాడ కలెక్టరేట్‌లో కొవిడ్‌ బిల్లుల మాయాజాలం

దొంగ బిల్లులుతో రూ.4కోట్లు దిగమింగేందుకు స్కెచ్‌

లేనిపోని ఖర్చులు చూపించి గుట్టుగా ఫైల్‌ ఆమోదించుకునేందుకు పథకం

దొంగబిల్లుల అనుమానంతో ఫైల్‌ ఆపేసిన కలెక్టర్‌

ఎన్ని కోట్లు కొట్టేయడానికి స్కెచ్‌ వేశారో తేల్చాలని ఆడిటింగ్‌ శాఖకు ఆదేశాలు

బాధ్యులైన కలెక్టరేట్‌ హెచ్‌సెక్షన్‌ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లపై బదిలీ వేటు

మరోపక్క రూ.4కోట్ల బిల్లుల తీగలాగితే రూ.80కోట్ల నిధుల డొంక కదులుతున్న వైనం

ఇవీ బయటకు వస్తాయనే భయంతో కీలక ఉద్యోగుల గుండెల్లో గుబులు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ బిల్లుల పేరుతో కాకినాడ కలెక్టరేట్‌లో కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమైంది. లేని ఖర్చులు చూపించి రూ.4కోట్ల వరకు పంగ నామం పెట్టేందుకు కొందరు ఉద్యోగులు స్కెచ్‌ వేశారు. దొంగ బిల్లుల తో డబ్బులు కాజేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం కలెక్టర్‌ను సైతం బురిడీ కొట్టించేందుకు పథకం పన్నారు. తీరా అనుమానం వచ్చిన కలెక్టర్‌ బిల్లులు మంజూరు కాదుకదా.. అసలు అంత ఖర్చుపై అను మానం వచ్చి విచారణకు ఆదేశించడం కలెక్టరేట్‌లో కలకలం రేపుతోం ది. బిల్లులు పంపి ఫైలు ఆమోదం కోసం ప్రయత్నించిన కలెక్టరేట్‌ హెచ్‌సెక్షన్‌ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లపై కలెక్టర్‌ బదిలీ వేటు వేశారు. మరోపక్క దొంగ బిల్లులపై అనుమానంతో కలెక్టరేట్‌కు విడుదలైన మొత్తం రూ.80కోట్ల కొవిడ్‌ నిధుల ఖర్చుపైనా అనుమానాలు రేకెత్తడంతో ఇప్పుడు డొంకంతా కదలబోతోంది.

పెద్ద స్కెచ్చే వేశారు..

కొవిడ్‌ మహమ్మారి 2019లో జిల్లాలో ప్రకంపనలు రేపింది. వేలాది మంది వైరస్‌ బారిన పడి ఆస్పత్రుల పాలయ్యారు. 2021లో వచ్చిన సెకండ్‌ వేవ్‌ అయితే వేల మందిని పొట్టనపెట్టుకుంది. లక్షల మంది బాధితులు వైరస్‌ వ్యాపించి అల్లాడిపోయారు. దీంతో అప్పటికప్పుడు కొవిడ్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటు దగ్గరనుంచి రోగులకు భోజనం, వారికి పడకలు, మందులు, బయట మెడికల్‌ క్యాంపులు, మందుల కొను గోలు, ఆక్సిజన్‌ కొనుగోలు ఇలా ఒకటేంటి అన్నిరకాల అత్యవసర ఖర్చులకు కేంద్ర, రాష్ట్రాల నుంచి కోట్లలో నిధులు విడుదలయ్యాయి. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌కు రూ.80కోట్ల వరకు నిధులు వచ్చాయి. దీనినుంచే అన్ని రకాల అత్యవసరాలకు నిధులు ఖర్చుచేశారు. దేనికి ఎంత ఖర్చయింది అనే లెక్కలు అప్పట్లో పట్టిం చుకోకుండా అటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ, ఇటు రెవెన్యూశాఖ ఈ ని ధులను ఎప్పటికప్పుడు ఎడాపెడా వినియోగించారు. వీటికి చాలా వరకు బిల్లులు చెల్లింపులు జరిగి సంబంధిత విభాగాల్లో కొందరు అధి కారులు, ఉద్యోగులు కమీషన్లు, నిధుల దారి మళ్లింపు రూపంలో ఇప్ప టికే కోట్లు కొట్టేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న బిల్లులకు సంబంధించి ఇటీవల కలెక్టరేట్‌ హెచ్‌ సెక్షన్‌ నుంచి కలెక్టర్‌కు నిధుల మంజూరుకు సంబధించి ఫైల్‌ వెళ్లింది. అందులో రూ.17కోట్ల లెక్కలకు సరిపడా బిల్లులు సిద్ధం చేసి రకరకాల ఖర్చులు చూపించారు. కొవిడ్‌ బాధితులకు మందులు, భోజనాలు, మంచాలు, భవనాల అద్దెలు, రవాణా ఖర్చులు, ఆక్సిజన్‌ సిలెండర్ల కొనుగోలుకు సంబంధించి బిల్లులు.. ఇలా అన్ని రకాలకు సంబంధించి చిట్టాను నివే దిక రూపంలో కలెక్టర్‌కు ఫైల్‌ అందింది. ఇందులో అనేక రకాల బిల్లు లు తప్పుల తడకగా ఉన్నాయి. మరికొన్ని పొంతనలేని ఖర్చులు కూ డా ప్రస్తావించారు. ఇంకొన్ని బిల్లులకు సంబంధించి జిల్లా వైద్య ఆరో గ్యశాఖ ముందుగానే ఖర్చులు చూపించి రూ.7కోట్ల వరకు బిల్లులు ఎప్పుడో మంజూరు చేయించుకున్నారు. తరచి చూస్తే రూ.17కోట్లకు సంబంధించి పంపిన బిల్లుల్లో రూ.4కోట్ల వరకు అదనంగా దొంగ లెక్కలు చూపించారు. దీంతో అనుమానం వచ్చిన కలెక్టర్‌ తాత్కాలికం గా బిల్లు చెల్లింపును పక్కన పెట్టారు. సిబ్బంది, ఇతర అధికారులను పిలిచి నిలదీస్తే దొంగ బిల్లులు భాగోతం బయటపడింది. దీంతో ఆగ మేఘాలపై కలెక్టరేట్‌లోని హెచ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ను ఏలే శ్వరం, సీనియర్‌ అసిస్టెంట్‌ను పాడేరుకు బదిలీ చేస్తూ ఇటీవల వేటు వేశారు. మరోపక్క దొంగ బిల్లులకు సంబంధించి రూ.4కోట్ల వరకు నొక్కేయడానికి స్కెచ్‌ వేయడంతో అసలు ఈ బిల్లుల్లో నకిలీవి ఎన్ని.. ఎంతవరకు మోసం చేసేందుకు పథకం పన్నారు? తదితర గుట్టు మట్లు బయటకు తీయాలని లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ విభాగాన్ని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో గడచిన కొన్నిరోజులుగా కలెక్టరేట్‌లో ఆడిట్‌ విభాగం అధికారులు రహస్య విచారణ కొనసాగిస్తున్నారు.

అప్పట్లో ఎంత నొక్కేశారో...

కొవిడ్‌ మొదటివేవ్‌నుంచి చివరి వేవ్‌ 2022 వరకు కలెక్టరేట్‌కు రూ.80కోట్ల వరకు నిధులు వచ్చాయి. వీటిని గతంలో రెవెన్యూ అధి కారులనుంచి మండలస్థాయిలో తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయం వర కు రకరకాల కొవిడ్‌ సేవలకు అవసరమైన వస్తువుల కొనుగోలు పేరు తో ఇష్టానుసారంగా ఖర్చు చేసి నిధులు మింగేశారు. ఇప్పుడు ఆ డొంక కదిలే ప్రమాదం ఉండడంతో సంబంధిత అధికారులు, ఉద్యోగు ల్లో వణుకు మొదలైంది. ఇటీవల జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వోను కలెక్టర్‌ సరెండర్‌ చేశారు. కొవిడ్‌ నిధుల దుర్వినియోగం నేపథ్యంలోనే పక్కా ఆధారాలు తేలడంతో కలెక్టర్‌ ఆమెపై వేటు వేసినట్లు తెలిసింది. దీంతో రూ.4కోట్లు కొట్టేయడానికి కలెక్టరేట్‌లో కొందరు అధికారులు, సిబ్బంది వేసిన స్కెచ్‌ బయటపడి మొత్తం డొంక కదులుతుండడంతో ఇప్పుడు కలెక్టరేట్‌లో సంచలనంగా మారింది. మరోపక్క కొవిడ్‌ నిధులను బిల్లుల రూపంలో మింగడంలోను కలెక్టర్‌ వద్దగా సీసీగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ యన తన బండారం బయటకు రాకుండా తెరవెనుక చక్రం తిప్పుతు న్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ దొంగ బిల్లుల ఆడిటింగ్‌పై జిల్లా ఆడిట్‌ అధికారిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాము బిల్లులపై ఆడిటింగ్‌ చేస్తున్నామని వివరించారు. అంతకు మించి తమకు ఏమీ తెలియదని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-02T01:16:09+05:30 IST