అవినీతి రహిత సమాజానికి వాజ్‌పేయి కృషి
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:03 AM
అవినీతి రహిత సమాజ స్థాపనకు అంకురార్పణ చేసింది దివంగత మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ అన్నారు. వాజ్‌పేయి జయంతిని సోమవారం పలుచోట్ల నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ
పలుచోట్ల మాజీ ప్రధాని జయంతి
గోపాలపురం, డిసెంబరు 25: అవినీతి రహిత సమాజ స్థాపనకు అంకురార్పణ చేసింది దివంగత మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ అన్నారు. వాజ్‌పేయి జయంతిని సోమవారం పలుచోట్ల నిర్వహించారు. గోపాలపురంలో బీజేపీ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు గెల్లా శ్రీనుబాబు కేకు కోసి, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా తన పరిపాలనతో సంక్షేమ అభివృద్ధిని దేశ ప్రజలకు అందించిన వ్యక్తిగా వాజ్‌పేయి గుర్తుండిపోయారన్నారు. ఎన్‌డీఏ పేరుతో పదేళ్లు దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు దేవినేని శ్రీనివాసరావు, శెట్టిపల్లి శివనాగరాజు, వీరరాఘవులు, కాట్రగడ్డ రవీంద్ర, మైలు శ్రీనివాసరావు, ఐటీ రాజు, నరేంద్ర, ఉండవల్లి మార్కండేయ చౌదరి, కొండేపాటి రత్నాజీచౌదరి పాల్గొన్నారు.