కామ్రేడ్ పల్లేటి బసవయ్య మృతి
ABN , First Publish Date - 2023-03-31T00:18:41+05:30 IST
అఖిల భారత రైతుకూలీసంఘం ఉమ్మడి తూ ర్పుగోదావరిజిల్లా నాయకుడు కామ్రేడ్ పల్లేటి బసవయ్య(70) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. మండలంలో గొర్రిపూడికి చెం
గొర్రిపూడి(కరప), మా ర్చి 30: అఖిల భారత రైతుకూలీసంఘం ఉమ్మడి తూ ర్పుగోదావరిజిల్లా నాయకుడు కామ్రేడ్ పల్లేటి బసవయ్య(70) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. మండలంలో గొర్రిపూడికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. దళిత సా మాజికవర్గానికి చెందిన ఆయన 2014 నుంచి న్యూ డెమోక్రసీ పార్టీలో, అఖిల భారత రైతుకూలీసంఘంలోను క్రియాశీలకంగా పనిచేసి పీడిత ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన మృతి పట్ల పలు వురు సంతాపం తెలిపారు.