కొబ్బరి జీన్‌ బ్యాంకుతో రైతులకు మేలు

ABN , First Publish Date - 2023-02-02T02:04:10+05:30 IST

కొబ్బరి జీన్‌ బ్యాంక్‌తో వివిధ రకాల కొత్త వంగడాలను రైతులకు అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని అంబాజీపేట డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్టార్‌ డాక్టర్‌ బి.శ్రీ నివాసులు అన్నారు.

కొబ్బరి జీన్‌ బ్యాంకుతో రైతులకు మేలు

అంబాజీపేట, ఫిబ్రవరి 1: కొబ్బరి జీన్‌ బ్యాంక్‌తో వివిధ రకాల కొత్త వంగడాలను రైతులకు అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని అంబాజీపేట డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్టార్‌ డాక్టర్‌ బి.శ్రీ నివాసులు అన్నారు. అంబాజీపేట పరిశోధన కేంద్రంలో కొబ్బరిలో సంకరీకరణపై మూడో రోజు శిక్షణ కొనసాగింది. ఈసందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కొబ్బరిలో మేలైన రకాలు, సంకరజాతి వంగడాల గురించి వివరించారు. కొబ్బరిలో ఆశించే తెగుళ్లు, పురుగులు, యాజమాన్య పద్ధతులపై సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌బీవీ చలపతిరావు వివరించారు. పరాన్నజీవులు, పరన్నాజీవులను ఉత్పత్తి చేయడంలో పాటించే మెళకువులపై కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్‌ వి.అనూష వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్‌ వి.గోవర్ధనరావు, రీసెర్చ్‌ అసోసియేట్‌ డాక్టర్‌ జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T02:04:12+05:30 IST